రేవంత్‌ రెడ్డి ఈజ్‌ బ్యాక్‌

Update: 2019-01-24 12:03 GMT
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి ఒక సంచలనం. కేవలం తన మాటనే పెట్టుబడిగా పెట్టి తెలంగాణ పాలిటిక్స్‌ సత్తా చూపించాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లోకి జంప్‌ అయిన రేవంత్‌ రెడ్డి.. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లుపాటు మీకు కన్పించను అని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. కొడంగల్‌ లో తన పై నెగ్గిన పట్నం నరేందర్‌ రెడ్డి ఎన్నిక చెల్లదని.. ఆయన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని హైకోర్టులో పిటీషన్‌ వేశారు రేవంత్‌ రెడ్డి.

ఈవీఎమ్‌ ట్యాంపరింగ్‌ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో దీనిపై పోరాటం చేస్తుంటే.. ఇక రాష్ట్రంలో టీపీసీసీ నాయకులు పోరాటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాచేశారు. గత ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగినట్లు తమకు అనుమానం ఉందని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌ కుమార్‌ కూడా రూలింగ్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఎన్నికలు పూర్తైన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.


Tags:    

Similar News