బీజేపీని తిడుతూ కాంగ్రెస్ కు దగ్గరైన సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలు టీపీసీసీలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ వర్గాలను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా టీడీపీని వదిలేసి బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరారు.
దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అంటే పడకనే.. కేసీఆర్ ను శత్రువుగా చూసే రేవంత్ నాటి రాజకీయ పరిణామాల్లో మోడీ, కేసీఆర్ స్నేహం చూసి బీజేపీతో టీఆర్ఎస్ బంధం చూసి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను ఎంచుకున్నారు.
అయితే తాజాగా కేసీఆర్ బీజేపీకి దూరంగా కాంగ్రెస్ కు దగ్గరగా మారుతున్నారు. దీన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అదే ఆయనకు గుదిబండగా మారింది.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మరో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్ లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. కేసీఆర్ మోడీ కోవర్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారని.. మోడీ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు.
థర్డ్ ఫ్రంట్ కాదు అది కేసీఆర్ సుపారీ గ్యాంగ్ అని రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ను నమ్మే ప్రసక్తే లేదని.. టీఆర్ఎస్ , కాంగ్రెస్ ఎప్పటికీ కలవబోవని ఆయన స్పష్టం చేశారు. మీ బర్త్ డేకు ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండని ఆయన అన్నారు.