టీఆర్ఎస్ పార్టీలో అంతా బాగానే ఉంది అన్న వాదన పైకి మాత్రమే వినిపిస్తోంది. కానీ లోపల మాత్రం వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల అభ్యర్థులను మార్చినా గెలుపు కష్టమే అని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో నెలకొన్న ముసలం కేటీఆర్ వెళ్లినా తీరలేదు.
అదేవిధంగా చాలా చోట్ల పార్టీ చాలా బలహీనంగా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ తనవైన ప్రకటనలతో కాస్తో కూస్తో నెగ్గుకు వచ్చేందుకు లేదా నెట్టుకు వచ్చేందుకు చూస్తున్నారు. ఆ విధంగా రానున్న కాలంలో గెలుపు ఖాయం చేసుకుని తీరాలని, రైతుబంధు లాంటి పథకాలను మళ్లీ మళ్లీ వినిపింపజేస్తూ, వీలున్నంత వరకూ సంబంధిత వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు చూస్తున్నారు.
అయితే పథకాల అమలులో అంతా గులాబీ దండే లబ్ధి పొందుతోందని రేవంత్ ఆరోపిస్తూ,గులాబీ శ్రేణులపై అసంతృప్తత ఉన్న నేతలను తమవెంట నడిపించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పథకాల్లో డొల్లతనంను తెరపైకి తెచ్చేందుకు వీలున్నంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చూస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహాలు పదును తేరనున్నా యి. దీంతో అదును చూసి ఇటుగా వచ్చేందుకు చాలా మంది గులాబీ దండు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ క్రమంలోనే జిల్లాల్లో రాజకీయాలు ఇప్పటి నుంచే మారిపోతున్నాయి.
రెండు ప్రధాన పార్టీలు ఏ చిన్న పాటి అవకాశం వచ్చినా కేసీఆర్ ను నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.ఆ క్రమంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యర్థి టీఆర్ఎస్ ను నిలువరించేందుకు ఉన్న అన్ని దారులనూ వీలున్నంత వరకూ వినియోగించుకుని, వచ్చే ఎన్నికల్లో గెలుపును వీలున్నంత ఎక్కువ స్థానాలలో ఖాయం చేసుకోవాలని చూస్తున్నారు.
పోటీలో బీజేపీ కన్నా కాంగ్రెస్ మాత్రమే ముందుందని కూడా సర్వేలు కొన్ని నిర్థారణ చేస్తూ ఉన్నాయి. కనుక రేవంత్ తనదైన వ్యూహంతో పీజేఆర్ కుమార్తెను చేర్చుకున్నారు. అదేవిధంగా నేడో రేపో జూపల్లి కృ ష్ణారావు (మాజీ మంత్రి) ను ఇటుగా తీసుకువచ్చేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. గతంలో కొల్లాపూర్ లో వరుసగా గెలిచిన దాఖలాలు ఉన్న కృష్ణారావు ను తమ పార్టీలో చేర్చుకుని తద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి.