మునుగోడులో రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. ఫలిస్తుందా?

Update: 2022-08-20 01:30 GMT
మునుగోడు.. కాంగ్రెస్ సీటు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటు. ఈ సీటును దక్కించుకునేందుకు ఇప్పుడు పార్టీలన్నీ రెడీ అయ్యాయి. ముఖ్యంగా రాజగోపాల్ రాజీనామా చేసిన వెళ్లిన బీజేపీ సీటును గెలుస్తుందని ఆశిస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ ఎలాగైనా సరే ఈ సీటును గెలవడానికి శూలశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సీటును తామే గెలుచుకోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశాడు.

ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి సెగ తగులుతోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పై పలువురు నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కడబలుక్కొని సొంత సామాజికవర్గాన్ని పెంపొందిస్తున్నారని.. కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ కు అడ్డుగా ఉన్న మునుగోడులో మరోసారి హస్తం జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం రేవంత్ రెడ్డి మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన మునుగోడు-మన కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు.

మునుగోడులోని ప్రతీగ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 7 మండలాలు, 176 గ్రామాల్లో కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టనుంది. అలాగే కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు కూడా పంపిణి చేయనున్నారు.  

 మునుగోడుపై ‘బీసీ కార్డు’ను ప్రయోగించేందుకు రేవంత్ రెడ్డి అయ్యారు. . దీంతో ఇప్పుడు రాజకీయాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది.మునుగోడు ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సీటు కోసం మూడు పార్టీలు కూడా తీవ్రస్తాయిలో శ్రమిస్తున్నాయి. టీఆర్ఎస్ అభివృద్ధి జపాన్ని నమ్ముకుంది. బీజేపీ పూర్తిగా కోమటిరెడ్డిపైనే భారం వేసింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘సామాజిక అస్త్రాన్ని’ బయటకు తీసింది. రేవంత్ రెడ్డి ఇక్కడే చక్రం తిప్పారు. మునుగోడులో మెజార్టీ సంఖ్యలో బీసీలు ఉన్నారు.అందుకే ఆ సామాజికవర్గాల కోసం బీసీలకు సీటు కేటాయించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను రేవంత్ రెడ్డి కలుపుకొని గెలుపు వ్యూహం రూపొందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు రేవంత్ టికెట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా రెండు నుంచి మూడు మార్గాల్లో ఓట్లను ఒడిసి పట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో ఓటు బ్యాంకును పరిశీలిస్తే ఒక్కడ 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. గౌడ ఓట్లు 35 వేలు, పద్మశాలీలు 32 వేలు, ముదిరాజ్ ఓటర్లు 31 వేల మంది ఉన్నారు. యదవుల ఓట్లు 26వేలు ఉన్నాయి. అంటే మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఓటు బ్యాంకును పరిశీలిస్తే ఇక్కడ బీసీలే 1.50 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక మాదిగలు 25వేల మంది ఉన్నారు. మాలలు 11వేల ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 11 వేల వరకూ ఉన్నారు. ముస్లింలు 6వేల మంది ఉన్నారు.

దీంతో మునుగోడులో గెలుపోటములను శాసించేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాల వారే 90శాతానికి పైగా ఉన్నారు.ఇక అగ్రవర్ణ ఓటర్లలో 7600 కాగా.. కమ్మవారు  దాదాపు 5వేల మంది ఉన్నారు. వెలమ ఓటర్లు 2500 మంది ఉన్నారు. ఆర్య, వైశ్య, బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4వేల మంది ఓటర్లు ఉన్నారు.

దీంతో బీసీ ఓట్లను తమవైపు తిట్టుకుంటే ఫలితం పాజిటివ్ గా ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే బీసీ వర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు కండువా కప్పిన వెంటనే టికెట్ విషయాన్ని అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలిసింది. ఇప్పటివరకూ అక్కడ బీసీ లకు టికెట్ ఇవ్వలేదు. గతంలో పాల్వాయి, కోమటిరెడ్డి లాంటి రెడ్డీలకు టికెట్ ఇచ్చింది. రేవంత్ బీసీ ఓట్లను టార్గెట్ చేసి ఈ వ్యూహం పన్నాడు.ఇది సక్సెస్ అయితే కాంగ్రెస్ కే విజయం ఖాయం.
Tags:    

Similar News