తెలంగాణ కాంగ్రెస్ రథసారధి.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రాజకీయ నేతలను టార్గెట్ చేసే ఆయన.. గడిచిన నాలుగైదు రోజులుగా ఆయన తెలంగాణకు చెందిన కొందరు కీలక అధికారులను టార్గెట్ చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. కేసీఆర్ లోని బిహార్ కోణాన్ని తీసిన ఆయన.. రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న వారంతా బిహారీలే అంటూ కొత్త తరహా చర్చకు తెర తీశారు. కేసీఆర్ థింక్ ట్యాంక్ గా అభివర్ణించే సీఎస్ మొదలు.. ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే అధికారుల్లో ఎక్కువ మంది బిహారీలే కావటం.. తాజాగా తన ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న పీకే సైతం అదే రాష్ట్రానికి చెందినోడు కావటంతో రేవంత్ వ్యాఖ్యలపై ఆసక్తి వ్యక్తమయ్యేలా చేస్తోంది.
రేవంత్ తాజా వ్యాఖ్యలు సదరు అధికారులకు తీవ్ర ఇబ్బందికి.. అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక రాజకీయ నేతగా.. నేతలను టార్గెట్ చేయాల్సింది పోయి..అందుకు భిన్నంగా సీనియర్ అధికారులపై విమర్శలు.. ఆరోపణల్ని సంధించటంలో లెక్కలేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రేవంత్ వ్యాఖ్యల్ని చూస్తే.. కేసీఆర్ కోర్ టీంను డిఫెన్సులో పడేయటమేనని చెప్పక తప్పదు. గులాబీ బాస్ అధిక ప్రాధాన్యం ఇచ్చే అధికారుల మూలాల్ని ప్రస్తావించటం ద్వారా.. తెలంగాణకు చెందిన సీనియర్ అధికారుల మనసుల్ని దోచుకోవటం.. తమకు ప్రాధాన్యత లభించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసే వారి మనసుల్ని గెలుచుకోవటం ఖాయమంటున్నారు.
సొంత రాష్ట్రంలో గుర్తింపు పొందని తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులు లోలోన ఉడికిపోతున్నారని.. సీనియార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న భావన వారిలో ఎక్కువగా ఉందంటున్నారు. అలాంటి వారికి దగ్గరయ్యేలా చేయటం కూడా రేవంత్ లక్ష్యమని చెబుతున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర పాలనతో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న అధికారులు పలువురు.. రేవంత్ తాజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి.
దశాబ్దాల తరబడి తెలంగాణలో ఉన్నప్పటికీ.. తాము నాన్ లోకల్స్ అన్న విషయాన్ని తెలంగాణ ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయితే.. తమకు ఇబ్బందులు తప్పవన్న భావనకు గురి అవుతున్నారు. దీంతో.. వారుతీవ్రమైన ఒత్తిడికి గురయ్యేపరిస్థితి. దీనంతటికి కారణమైన రేవంత్ విషయంలో వారుఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరహా ఆగ్రహావేశాలు రేవంత్ కు నష్టం చేసే అవకాశం ఉందంటున్న వారి అంచనాలుతప్పుగా చెబుతున్నారు.
ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ను మొదట్లో సీనియర్ అధికారులు ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఆయన్ను లైట్ తీసుకునేవారు. అలాంటి వారిపై వ్యూహాత్మకంగా ఒత్తిడికి గురయ్యేలా చేసేవారు కేసీఆర్. దీంతో దెబ్బకు దారికి రావటమే కాదు.. తనను టార్గెట్ చేయొద్దన్న రాయబారాల్ని పంపేవారని చెబుతారు. రేవంత్ తీరు చూస్తే.. ఇప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలోని పరిస్థితికి ఇప్పటి పరిస్థికి తేడా చాలా ఉందంటున్నారు. అయినప్పటికీ.. రేవంత్ నోటి నుంచి మాత్రం ‘బిహార్’ మాట వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రేవంత్ కు కొత్త కష్టాలు తెచ్చి పెడతాయన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాటికి రేవంత్ ఎప్పుడో రెఢీ అయి ఉంటారన్న మాట వినిపిస్తోంది. మరి.. రేవంత్ నోటి నుంచి వస్తున్న బిహార్ మాటలు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.