తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డకు వస్తున్న రాహుల్ గాంధీని.. 'మీరు ఎక్కడ ఉన్నారు' అంటూ ట్వీట్ తో ప్రశ్నలు సంధించిన ఆమె.. తెలంగాణకు ఆయనేం చేయలేదన్నట్లుగా తేల్చేయటం తెలిసిందే.
ఇలాంటివేళ.. కవిత ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు. 'చూసుకొని మురవాలి.. చెప్పుకొని ఏడ్వాలి' అంటూ కవిత ట్వీట్ తరహాలోనే ఆమెను.. పలు ప్రశ్నలు సంధించారు.
ఈ ట్వీట్ల పంచ్ లను చదివిన తర్వాత.. అనవసరంగా ట్వీట్ చేశానే అన్న భావన కవితకు కలిగేలా రేవంత్ ట్వీట్లు ఉన్నాయని చెప్పాలి. ఇంతకూ ఆయన ఇచ్చిన ట్వీ్ట్ పంచ్ లు ఏమంటే..
శ్రీమతి కవితగారూ.. శ్రీ రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
- మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?
- మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?
- వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి.. ఆయన ఫాంహౌస్ లో 150 ఎకరాల్లో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?
- ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?
- రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మీరెక్కడ ఉన్నారు?
- రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని మీ తండ్రి చెప్పి ఐదేళ్లు అవుతున్నా అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు. మరి మీరెక్కడ ఉన్నారు?
- అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాశులు తడిచి రైతులు భోరున విలపిస్తున్నారు. వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు?
- ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయటం ద్వారా చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?