ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నాక కొంచెం దూకుడైతే తగ్గింది కానీ.. రేవంత్ రెడ్డిలో చమత్కారం అయితే పోలేదు. ఇప్పటికీ ఆయన శైలిలో చమక్కులు విసురుతూనే ఉంటాడు. తాజాగా తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలో మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు రేవంత్ రెడ్డి. శాసన సభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆరే అన్నీ తానై వ్యవహరిస్తున్నారని.. తన మంత్రులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించాడు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను ఉద్దేశించి అసెంబ్లీ లాబీల్లో ఆయన వేసిన సెటైర్ అందరినీ నవ్వించింది.
తలసాని ఎదురు పడ్డపుడు ఆయన్ని చూసి మాట్లాడుతూ.. ‘‘అన్నా ఏదన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోవే.. ఎలాగూ ఆయన (సీఎం) వచ్చాక మీకు అవకాశం రాదు’’ అంటూ సెటైర్ వేశాడు రేవంత్ రెడ్డి. దీంతో మీడియా ప్రతినిధులతో పాటు అందరూ నవ్వుకున్నారు. తలసాని కూడా ఈ సెటైర్ని సీరియస్ గా తీసుకోకుండా నవ్వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మీద విమర్శల దాడిని కొనసాగించాడు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రుల పాత్ర నామమాత్రమని.. కేసీఆర్ ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డామినేట్ చేస్తున్నారని.. మంత్రుల తరఫున కూడా ముఖ్యమంత్రే మాట్లాడటం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/