టీఆర్ ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ వెనుక రీజన్ ఇదే: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రైతుల కోసమే తాము పార్లమెంటుసమావేశాలను బహిష్కరిస్తున్నట్టు టీఆర్ ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు.. నామా నాగేశ్వరరా వు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అభ్యర్థనను స్పీకర్, చైర్మన్(రాజ్యసభ)లు పట్టించుకోకపోవడంతోనే తాము బహిష్కరిస్తు న్నట్టు చెప్పారు. అయితే.. టీఆర్ ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు బహిష్కరణ వెనుక ఈడీ హెచ్చరికలు, భయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అదేసమయంలో బీజేపీతో ఉన్నరహస్య ఒప్పందం నేపథ్యంలోనే ఎంపీలను సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్లమెంటును బహిష్కరించేలా చేశారని విమర్శించారు.
ఒక భూ కుంభకోణంలో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఈడీ తాత్కాలికంగా వాయిదా వేసిందని, ఇందుకు బదులుగా.. పార్లమెంటు సజావుగా సాగేలా కేంద్రానికి సహకరించడానికి టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించారని ఆరోపించారు. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీల్లో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థను, ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తున్న మరో సంస్థను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ భూములను గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో వేలం వేసినప్పుడు విదేశాలకు చెందిన ఓ సంస్థ రూ.450 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ సంస్థను బెదిరించి ఆ భూములను దాదాపు రూ.300 కోట్లకు రాయించుకుందని ఆరోపించారు. ఆ భూముల విలువ ప్రస్తుతం రూ.3 వేల కోట్ల మేర ఉంటుందన్నారు. ఈ మొత్తం కుంభకోణానికి కేటీఆరే కారణమని ఈడీ తేల్చిందని చెప్పారు. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు అంతరం ఏర్పడిందని, దాంతో ధాన్యం కొనుగోలును అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులు, విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటు వేదికగా రెండు పార్టీలు నాటకమాడాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటి మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులివ్వడాన్ని ఈడీ తాత్కాలికంగా ఆపేసిందని చెప్పారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నందునే పార్లమెంటు నుంచి ఆ పార్టీ ఎంపీలు వెనక్కి వెళ్లారని అన్నారు. ''పార్లమెంటులో నిరసనలు విరమించుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు.. సీఎం కేసీఆర్ పాటించారు'' అని రేవంత్ వ్యాఖ్యానించారు. అంతర్గతంగా మోడీ, కేసీఆర్ ఒక అవగాహనకు వచ్చారని, అందుకే నవంబరులో ఢిల్లీ వచ్చి వెనక్కి వెళ్లిన కేసీఆర్ ఎక్కడ కూడా రైతు సమస్యలపై కార్యాచరణ ప్రకటించలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో అగ్గిపుట్టిస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్య తీరిందా? యాసంగిలో ఎంత కొనుగోలు చేస్తుందో పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందా? అని నిలదీశారు.