ఆపరేషన్ రేవంత్‌లో అడ్డంగా బుక్ అయి.. కోర్టు రిమాండ్‌కు పంపటంతో సోమవారం చంచల్‌గూడ జైలుకు తరలించటం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డికి అవసరమైన భద్రత లేని నేపథ్యంలో.. ఆయన్ను చర్లపల్లి జైలుకు పంపాలని జైలు అధికారులు కోరటం తెలిసిందే.
చంచల్ గూడ జైలులో ఐఎస్ ఐ తీవ్రవాదులు ఉండటంతోపాటు.. జైలు కిక్కిరిపోయిన నేపథ్యంలో ఆయన్ను చర్లపల్లికి తరలించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో.. రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో.. మంగళవారం ఉదయం వరకు చంచల్ గూడ జైలులో ఉన్న రేవంత్‌ను చర్లపల్లికి తరలించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించింది. రాజకీయంగా కుట్ర చేసిన రేవంత్ ను ఈ కేసులో ఇరికించారంటూ రేవంత్ తరఫు లాయర్లు వాదిస్తున్నారు. శుక్రవారం వరకూ రేవంత్ బెయిల్ కోసం ఎదురుచూడాల్సిందే.