రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అన్నది అందరికీ తెలుసు. కానీ.. ఎవరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరు ఎవరికి శత్రువులు అన్నది సామాన్యులు కనుక్కోలేరు. ఎవరు శత్రుత్వం నటిస్తున్నారు? ఎవరు తెరచాటు స్నేహం నెరపుతున్నారనేది అందరూ కనిపెట్టలేరు. మీడియా ముందు కత్తులు దూసుకొని.. మీడియా వెనుక హత్తుకోవడం చాలా మంది నేతలు చేస్తుంటారు. ఇప్పుడు.. కేసీఆర్ కూడా బీజేపీ నేతలతో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ పోరు సాగుతోందనే వాతావరణం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఒక పార్టీ అంతిమ లక్ష్యం అధికార స్థాపనే అన్నది సాధారణమైన విషయం. కాబట్టి.. ఈ విషయంలో సందేహం లేదు. కానీ.. ఒకసాయం వీళ్లు చేస్తే.. మరోసాయం వాళ్లు చేయడం అనేది కూడా రాజకీయాల్లో అంతర్గతం సాగుతుంది. ఒకవైపు పోరాటం సాగిస్తూనే.. సహకారం ఇచ్చిపుచ్చుకోవడం కూడా సాగుతూ ఉంటుంది.
జీహెచ్ ఎంసీ ఎన్నికలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన అడగటమే ఆలస్యం అన్నట్టుగా.. బీజేపీ అగ్ర నేతలంతా అపాయింట్‌మెంట్లు ఇచ్చేశారు. చర్చలు జరిపారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. కానీ.. ఏం మాట్లాడుకున్నారు? అన్నది మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. పర్యటన ముగించుకున్నారు వచ్చేశారు. వచ్చిన తర్వాత కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన ప్రధానమైన విషయాల్లో టీఆర్ఎస్ మౌనం వహించదనే విమర్శ కూడా ఉంది. కీలకమైన వ్యవసాయ చట్టాల విషయమై ఒకరోజు ఆందోళన చేపట్టి.. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు అనుకూలంగానే వ్యవహరించారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఇలా.. ప్రధానమైన విషయాల్లో బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ ఉంటోందనే విశ్లేషణలు కూడా వచ్చాయి.
ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మరో సాక్ష్యం చూపిస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాకు జీ హుజూర్ అంటున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 'పెగాసస్' సాఫ్ట్ వేర్ అంశం కూడా దేశాన్ని కుదిపేసింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొత్తం ఈ అంశంపై చర్చతోనే ముగిసిపోయాయి. విపక్ష నేతలు, జర్నలిస్టులు, చివరకు సుప్రీం కోర్టు జడ్జీలపైనా నిఘాపెట్టారని, వారి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా కేంద్ర ప్రభుత్వమే చేసిందంటూ విపక్షాలు ఆరోపించాయి. దీనిపై విచారణ జరిపించాలని, పార్లమెంట్ చర్చించాలని కోరినా.. సర్కారు స్పందించలేదు. దీంతో.. అనుమానాలు మరింత బలపడ్డాయి కూడా.
అయితే.. ఈ విషయమై బీజేపీ సర్కారును నిలదీసేందుకు దేశంలోని 14 ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. కానీ.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వీటితో చేరలేదు. ఈ విషయమై రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీజేపీతో ఎలాంటి ఒప్పందమూ లేకపోతే.. ఈ కూటమిలో కేసీఆర్ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. పైకి బీజేపీతో వైరం ఉన్నట్టుగా నటించే కేసీఆర్.. లోపల మాత్రం మంచి మిత్రుడని, ఈ కారణం వల్లనే.. కేంద్రాన్ని ప్రశ్నించట్లేదని ఆరోపించారు. అటు ఏపీలోని వైసీపీపైనా ఇలాంటి విమర్శలే ఉన్నాయి. జగన్ ఒక అడుగు ముందుకేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలో నరేంద్రమోడీ అద్భుతంగా పోరాడుతున్నాడంటూ ట్వీట్ చేసి విమర్శల పాలయ్యారు. దేశంతోపాటు చివరకు న్యాయస్థానాలు కూడా కేంద్రాన్ని తప్పుబడితే.. జగన్ మాత్రం భుజానికెత్తుకున్నారు. ఈ విధంగా.. కేసీఆర్ కూడా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. మరి, దీనికి గులాబీ నేతలు ఏం సమాధానం చెబుతారో?