కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చిచ్చు పెట్టింది. ఏకగ్రీవం చేయాలని సోనియాగాంధీ సహా కాంగ్రెస్ పెద్దలంతా నిర్ణయించారు. కానీ కాకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పంతం పట్టారు. దీంతో తమను ఎదురించిన శశిథరూర్ కు కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గ్రూప్ తగాదాలు పతాకస్థాయికి చేరాయి. అధ్యక్ష పోటీలో రెబల్ గా దిగుతున్న శశిథరూర్ కు కనీసం రాస్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను ఇంటికి ఆహ్వానించారని.. తాను వెళ్లలేక పోయినట్లు చెప్పారు. కానీ గాంధీభవన్ కు పిలిస్తే వెళ్లి ప్రచారం చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇప్పుడు శశిథరూర్ కు రేవంత్ రెడ్డి అవసరం పడింది కనుక అణిగిమణిగి వస్తున్నాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీచేస్తున్న థరూర్ ప్రచారం కోసం వచ్చినా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఆయనకు స్వాగతం పలకలేదు. కనీసం ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతించలేదు. పోనీ గాంధీభవన్ కు వచ్చి ఓటు హక్కు ఉన్న ఏఐసీసీ ప్రతినిధులను కలుద్దామంటే శశిథరూర్ కు చుక్కెదురైంది.
తాజాగా శశిథరూర్ హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే తన సమీప బంధువు చనిపోయాడని.. రాలేనని చెప్పి షాకిచ్చాడు. అనంతరం ఇది జరిగిన గంటనే వెంటనే బీజేపీని విమర్శించేందుకు బయటకొచ్చి గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఒకప్పుడు వీరిద్దరి మధ్యన సాగిన సంవాదానికి ప్రతీకారంగానే రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తించారని.. అధిష్టానం ఆదేశానుసారం శశిథరూర్ ను దక్కరకు రానీయకుండా అవమానించాడని తెలుస్తోంది.
శశిథరూర్ కు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మద్దతు లేదు. కేరళలో కూడా ఆయనకు మద్దతు లభించలేదు. కానీ ఎన్నికల్లో పోటీచేస్తూ ఎన్నిక ఏకగ్రీవం చేద్దామనుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారారు.
అప్పట్లో ఇదే రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో శశిథరూర్ పై నోటికొచ్చినట్టు తిట్టాడు. ఆ వీడియోను కొందరు తీసి లీక్ చేశారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఇలా సీనియర్లను ఎలా తిడుతున్నాడో చూడండి అంటూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శశిథరూర్, రాహుల్ గాంధీని ట్యాగ్ చేశాడు. అప్పుడు స్వయంగా ఫోన్ చేసి మరీ శశిథరూర్ కు రేవంత్ సారీ చెప్పారు. కానీ శశిథరూర్ వినకుండా రేవంత్ ను తిట్టి ఆయన పీసీసీ పీకేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు అధిష్టానమే శశిథరూర్ దూరం పెట్టాలని చెప్పడంతో నాటి అవమానానికి రేవంత్రెడ్డి ఇలా ప్రతీకారం తీర్చుకున్నటైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.