కేసీఆర్ కు మళ్లీ పెళ్లా...?

Update: 2015-10-09 06:47 GMT
 తెలంగాణ టీడీపీ పంచ్ ల పిట్ట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరో పంచ్ వేశారు... డిసెంబరులో తన కుమార్తె పెళ్లి చేయబోతున్న రేవంత్ రెడ్డి ఆ శుభకార్యం పూర్తయిన తరువాత కేసీఆర్ కు తన చేతిలో పెళ్లి తప్పదంటున్నారు. ఎవరికైనా బుద్ధి చెప్పడం... దండించడం వంటి అర్థంలోనూ పెళ్లి చేయడం అన్న పదాన్ని వ్యంగ్యంగా వాడుతారన్న సంగతి తెలిసిందే కదా... రేవంత్ కూడా అదేవిధంగా మాట్లాడుతూ డిసెంబరులో కూతురికి వివాహం చేసిన తరువాత కేసీఆర్ కు పెళ్లి చేస్తానని వార్నింగు ఇచ్చారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తరువాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకు సరైనా మోకా కోసం చూస్తున్నారు. అయితే... ఆయనకు అంతలో వ్యక్తిగత కారణాల వల్ల పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. ఇటీవల రేవంత్ సోదరుడు మృతిచెందారు... అలాగే డిసెంబరులో రేవంత్ కుమార్తె వివాహముంది. దీంతో కుటుంబ బాధ్యతలు ఉండడంతో ఆయన కేసీఆర్ ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేయలేకపోతున్నారు.

...దీంతో రేవంత్ ఇటీవల నిజామాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి టీడీపీ నిర్వహించిన ధర్నాలో రేవంత్ కేసీఆర్ పై తన కార్యాచరణను అనౌన్స్ చేశారు... డిసెంబరులో కుమార్తె వివాహం అయిపోతే ఆ తరువాత తాను ఫ్రీ అయిపోతానని... అప్పుడు కేసీఆర్ పనిపడతానని చెప్పారు.

కాగా నిజామాబాద్ ర్యాలీలోనే రేవంత్ టీఆరెస్ నేతలకూ వార్నింగు ఇచ్చారు... సీఎం కేసీఆర్ ఉన్నారని మీరు రెచ్చిపోవద్దు... మాకు ప్రధానమంత్రి మోడీ ఉన్నారంటూ బీజేపీ నేతల వంక చూస్తూ టీఆరెస్ నేతలకు వార్నింగు ఇచ్చారు.... ఇదంతా ఎలా ఉన్నా డిసెంబరులోనో... ఆ తరువాత కొత్త సంవత్సరంలోనో కేసీఆర్ కు ఫిటింగు పెట్టడానికి రేవంత్ రెడీ అవుతున్నారని మాత్రం అర్థమవుతోంది.. అయితే, ఆయన ఏం చేస్తారు.. కేసీఆర్ ను ఎక్కడ ఇరికిస్తారు... హైదరాబాద్ లోనా.. ఫాం హౌస్ లోనా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News