ప‌ద‌వి చేప‌ట్ట‌కముందే కేసీఆర్‌ను ఖుష్ చేసిన రేవంత్ రెడ్డి

Update: 2021-07-07 01:30 GMT
ఏంటి నిజ‌మా?  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖుష్ అయ్యేలా... ఆయ‌నంటే నిప్పులు చెరిగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారా? ఇది జ‌రిగే ప‌నేనా... అంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారా? జ‌రిగే ప‌ని కాదు. నిజంగా జ‌రిగిన ప‌ని!!. టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితుడైన రేవంత్ రెడ్డి త‌న కోసం తాను చేసుకున్న ప‌నివ‌ల్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఊహించ‌ని మేలు చేశారు. నిజంగా ఇది నిజం.

టీపీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితుడైన రేవంత్ రెడ్డి ఈ మేర‌కు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేముందు ముఖ్య నేత‌ల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే. సొంత రాష్ట్రం, ప‌క్క రాష్ట్రం అనే తేడా లేకుండా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో భేటీ అవుతున్నారు. ఇదే ఒర‌వ‌డిలో బెంగ‌ళూరులో ప‌ర్య‌టించి కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంటరీ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో స‌మావేశం అయ్యారు. ఆ పార్టీ ముఖ్య నేత డీకే శివ‌కుమార్ తో సైతం భేటీ అయ్యారు. బెంగ‌ళూరు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడి నుండి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటికి వెళ్లి ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీ రావు తో భేటి అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ రావు తో మర్యాదపూర్వకంగా సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై కాసేపు చ‌ర్చించారు.

తెలుగు రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖులు, పార్టీ ముఖ్యుల‌ను క‌లుస్తున్న రేవంత్ ఈ క్ర‌మంలోనే ఈనాడు వ్య‌వ‌స్థ‌ల దిగ్గ‌జం రామోజీరావును క‌లిశార‌న్న‌ది నిజం. అయితే, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలో కాంగ్రెస్ చేసే విమ‌ర్శ‌ల్లో ``ల‌క్ష నాగ‌ల్ల‌తో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతాన‌న్న కేసీఆర్‌.. .ఇప్పుడు చ‌ప్పుడు చేయ‌ట్లేదేంటి? ``అన్న‌ది ఒక‌టి. తాజాగా పీసీసీ అధ్య‌క్షుడే రామోజీ రావు క‌లిసి ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఇక ఫిల్మ్ సిటీ భూముల విష‌యంలో టీఆర్ఎస్ ను ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు కాంగ్రెస్ కోల్పోయిన‌ట్లేన‌ని ప‌లువురు అంటున్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా కేసీఆర్‌కు రేవంత్ ఊహించ‌ని మేలు చేశార‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News