శ‌శి థ‌రూర్‌కు రేవంత్ సారీ.. ఓకే చెప్పిన సీనియ‌ర్ నేత‌

Update: 2021-09-17 09:46 GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ.. శ‌శిథ‌రూర్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల దుమారం.. టీక‌ప్పులో తుఫాన్ మాదిరిగా స‌మ‌సిపోయింది. ఇటీవ‌ల తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన థ‌రూర్‌.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కొనియాడారు. దీనిపై వెంట‌నే స్పందించిన రేవంత్‌.. శ‌శి థ‌రూర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతోపాటు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యాఖ్య‌లుచేశారు. దీంతో ఇది తీవ్ర వివాదంగా మారింది. రేవంత్ వ్యాఖ్య‌లను సొంత పార్టీ నేత‌లే త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో రేవంత్ త‌న వ్యాఖ్య‌ల‌పై సారీ చెప్పారు. వాస్త‌వానికి తొలుత‌.. తానా వ్యాఖ్య‌లు చేయ‌లేద న్న‌..రేవంత్‌.. టీఆర్ ఎస్ సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యే స‌రికి.. ఇబ్బందిలో ప‌డ్డారు. దీంతో వెంట‌నే రియాక్ట్ అయ్యారు. ``నేను శ‌శి థ‌రూర్ జీతో మాట్లాడాను. నా వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నాను. నా సీనియ‌ర్‌గా శ‌శిథ‌రూర్ ప‌ట్ల నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. నా వ్యాఖ్య‌ల వ‌ల్ల మీకు ఎలాంటి ఇబ్బంది క‌లిగింద‌ని భావించినా.. చింతిస్తున్నాను.`` అని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

దీనిపై స్పందించిన శ‌శి థ‌రూర్‌.. ``రేవంత్ నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. అనుముల‌(రేవంత్ ఇంటి పేరు) నాకు సారీ చెప్పారు. ఆయ‌న ఆవేద‌న‌ను నేను అర్ధం చేసుకున్నాను. అనుకోకుండా .. జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి.. ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ‌తో నేను సంతోషించాను. మేమంతా కాంగ్రెస్ అభ్యున్న‌తి కోసం.. ముఖ్యంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ అభివృద్ది చెందేందుకు క‌లిసి క‌ట్టుగా కృషి చేస్తాం`` అని థ‌రూర్ ట్వీట్ చేశారు.

అయితే.. ఈ విష‌యంపై తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మానిక్కం ఠాకూ ర్‌.. తీవ్రంగా స్పందించారు. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రు లీక్ చేశారంటూ.. ఆయ‌న ప్ర‌శ్నించారు. ``ఆఫ్ దిరికార్డుగా.. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు జ‌ర్న‌లిస్టులు రికార్డు చేసి.. అధికార ప‌క్షానికి అందించ‌డం.. స‌రికాదు.. ఇలాంటివి చేసే వారిని సుపారీ జర్న‌లిస్టులుగా భావిస్తే.. త‌ప్పేంటి?`` అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



Tags:    

Similar News