ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్థంతి నేడు. ఆ మహానేత ఈ భువిని విడిచి వెళ్లి అప్పుడే 12 ఏళ్లు గడిచిపోయాయి. కానీ, అయన చిరునవ్వు మాత్రం ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది. ఆ మహానాయకుడి వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు నివాళ్లు సమర్పించారు.
ఇక, వైఎస్ ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్ ఆర్ తో పని చేసిన వారికి, సన్నిహితులకు స్వయంగా విజయమ్మే ఆహ్వానాలు పంపారు. ఈ సమావేశానికి ఇప్పటికే కేవీపీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు హాజరు కాబోతున్నట్టు వెల్లడించారు.
ఇక, గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్ విజయమ్మ ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంపై స్పందించారు. విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం వ్యక్తిగత అంశమని, అది ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ఆత్మీయులుగా ఉన్న నాయకులను పిలిచారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా, విజయమ్మ కొడుకు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉండగా, ఆమె కుమార్తె, ఈ మధ్యే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తమ బిడ్డకు మద్దతు ఇవ్వాలంటూ కొందరు నేతలు, గతంలో పనిచేసిన అధికారులను కోరిన విజయమ్మ ఇప్పుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల కోసమే విజయమ్మ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి.
వైఎస్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్‌లో మరికాసేపట్లో జరుగబోతోన్న ఆత్మీయ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక, ఈ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో ఉమ్మడి శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి తోపాటు, ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో పాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సినీవర్గం నుంచి హీరో నాగార్జునతోపాటు డైరెక్టర్లు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంస్మరణ సభకు ఎవరెవరు హాజరవుతారు..ఎవరు డుమ్మా కొడతారన్న దానిపైనే సస్పెన్స్ నెలకొంది