కేసీఆర్‌ ను ఇర‌కాటంలో ప‌డేస్తున్న రేవంత్‌

Update: 2017-02-08 16:13 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసి  విరామం లేకుండా పోరాటం చేస్తున్న తెలంగాణ టీడీపీ నాయ‌కుడు రేవంత్ రెడ్డి ఇపుడు త‌న కార్య‌క్షేత్రానికి ఢిల్లీని వేదిక‌గా చేసుకున్నారు. ఇన్నాళ్లు రాష్ట్ర స్థాయిలో - కొద్దికాలంగా క్షేత్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్న రేవంత్ రెడ్డి ఇపుడు హ‌స్తిన కేంద్రంగా కేసీఆర్‌ ను తిప్ప‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌ను కేసీఆర్ సార‌థ్యంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగా ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, అర్హుల‌కు పథ‌కాల పంపిణీలో నిర్ల‌క్ష్యం చూపిస్తున్నార‌ని పేర్కొంటూ రేవంత్ రెడ్డి స‌హా పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ స‌హా ఇత‌ర సీనియ‌ర్లు క‌లిసి కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడుతో స‌మావేశ‌మై ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు.

పార్లమెంటు ఆవరణలో  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని క‌లిసిన తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప‌లు సమ‌స్య‌ల‌ను ఆయ‌న వ‌ద్ద‌ ప్ర‌స్తావించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను తెలంగాణ సర్కార్ పేదలకు ఇవ్వడం లేదని తెలంగాణ తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన వెంకయ్య దీనిపై విచారణ జరిగి అవసరమైన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. త‌ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం రూపంలో కేసీఆర్‌ను ఇర‌కాటంలో పెట్టవ‌చ్చున‌నేది తెలంగాణ టీడీపీ నేత‌ల టార్గెట్ అని చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News