ప్రేమ.. పగ.. ఈ రెండింటి మధ్యన ఉన్నది కేవలం బంధం మాత్రమే. అప్పటివరకూ ప్రేమగా ఉండే వారు.. విడిపోగానే పగోడిలా మారుతారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దిరీదీ ఇదే దారి. కానీ ఎక్కువ శాతం అమ్మాయిలే బాధితులుగా మారుతున్నారు.
ఇటీవల బెంగలూరులో ప్రేమించుకున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తీరా పెళ్లి చేసుకుందామనే సరికి అమ్మాయి కాదన్నది. ఆమె ఫొటోలు , వీడియోలు బయటపెడుతానని బెదిరించి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ అవమానంతో టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇలా చేసే వారిలో అబ్బాయిలదే ఎక్కువ శాతం ఉంది.
ఒకరితో రిలేషన్ లో ఉండగా.. వారికి తెలిసి, తెలియకుండా తీసుకున్న సన్నిహిత ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేసి వారికి మానసిక క్షోభ కలిగించడమే 'రివేంజ్ పోర్న్' అంటారు. బ్రేకప్ కారణంగా వాటిని వాట్సాప్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్ ఫాంలలో షేర్ చేసి ఇబ్బంది పెడుతున్న వారి సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది.
ఇందులో ఎక్కువ ఘటనల్లో మహిళలే బాధితులు కాగా.. కొన్ని సందర్భాల్లో మగవారితోపాటు 12 ఏళ్లు దాటిన వారు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి బ్లాక్ మెయిల్ ప్రేమలు చివరకు పోలీస్ స్టేషన్ గడప తొక్కేవరకూ వెళుతున్నాయి. ఇటీవల వేరొకరితో పెళ్లికి రెడీ అయిన యువతిని ఆమెతో పర్సనల్ గా ఉన్న ఫొటోలు వీడియోలు చూపించి పెళ్లిరోజు ముందు వరకూ అనుభవించిన ఓ ప్రబుద్దుడు చివరకు ఆమె పెళ్లి పెటాకులు చేశాడు. గర్భం దాల్చడంతో పెళ్లికి నో చెప్పాడు.
ఇప్పుడు ఈ ప్రేమించి విడిపోయే సమయంలో భాగస్వామిపై కోపంతో పెళ్లి పెటాకులు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది తీవ్ర రూపాలకు దారితీస్తోంది. చూడాలి మరీ ఈ బంధాలు ఎటువైపు పోతాయో..