ఐఫోన్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఎదిగిన యాపిల్ కు నరేంద్ర మోదీ సర్కారు పెద్ద షాకే ఇచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ లో తయారీ రంగానికి కొత్త జవసత్వాలు నింపేందుకంటే మేకిన్ ఇండియా పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రకారం భారత్‌లో తయారీ యూనిట్లను నెలకొల్పే కంపెనీలకు భారీ ఎత్తున తాయిలాలు ఇస్తారు. ఈ తాయిలాలను ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు ఇప్పటికే కొంతమేర విజయం సాధించిందనే చెప్పాలి.
తయారీ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన పలు బహుళ జాతి కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను భారత్ లో నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ యూనిట్లను భారత్ లో నెలకొల్పాయి కూడా. ఈ క్రమంలో యాపిల్ కూడా తన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐఫోన్ ను భారత్ లోనే తయారు చేస్తామని ఓ ప్రతిపాదన మోదీ సర్కారు ముందు పెట్టింది. ఆ ప్రతిపాదనతో పాటు తనకు కావాల్సిన రాయితీలను కూడా ప్రస్తావిస్తూ ఆ కంపెనీ... ఓ పెద్ద జాబితానే ప్రభుత్వం ముందు పెట్టింది. యాపిల్ ప్రస్తావించిన ఈ ప్రతిపాదలను భారతీయ మీడియా గొంతెమ్మ కోర్కెలుగానే అభివర్ణించింది.
ఈ క్రమంలో యాపిల్ ప్రతిపాదనలను పరిశీలించిన నరేంద్ర మోదీ సర్కారు... వాటికి ససేమిరా అంది. అయినా యాపిల్ ప్రతిపాదించిన రాయితీల విషయానికి వస్తే... దీర్ఘకాలిక ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వాలని, పన్ను పరిమితుల నుంచి తమను మినహాయించాలని యాపిల్ కోరుతోంది. జీఎస్టీ నుంచి కూడా తమకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని యాపిల్ కోరుతోంది. 15 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే ఈ డిమాండ్లను కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించేసింది. ఈ మేరకు యాపిల్ ప్రతిపాదనలకు అనుమతించబోమని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆ సంస్థకు లేఖ కూడా పంపినట్లు విశ్వసీనయ సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/