డ్రగ్స్ కేసుపై హైకోర్టుకు రేవంత్ రెడ్డి..: టాలీవుడ్లో టెన్షన్.. టెన్షన్..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి టాలీవుడ్ పై పడింది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నారని వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి, తదితరుల పిటిషన్ల కారణంగా ఆ కేసులో హడావుడి మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరోసారి సినీ ఇండస్ట్రీని ఫోకస్ చేశారు. ఇటీవల ఫుడ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఈనెల 2న జరిగిన దాడిలో పట్టుబడిన వారందరిని విచారించాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై మరోసారి ఫుడ్ అండ్ మింక్ పబ్ వార్తల్లో నిలిచింది.
ఈనెల 2న రాడిసన్ బ్లూ ఫాజాలోని ఫుడ్ అండ్ మింక్ పబ్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మూకుమ్మడిగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు లభించాయని వారు తెలిపారు.
అంతేకాకుండా పబ్ లో ఉన్న దాదాపు 150 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వారిలో కొందరని అరెస్టు చేసి మిగతా వారి అడ్రస్ డీటేయిల్స్ తీసుకొని వదిలేశారు. ఫుడ్ అండ్ మింక్ పబ్ దాడిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే కొందరు సినీ రంగానికి చెందినవారు డ్రగ్స్ వినియోగించిన వారిపై పోలీసుల చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అయితే పోలీసులు ఆ తరువాత రోజు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని అయితే అందరూ దీనిని వినియోగించలేదని తెలిపారు. కానీ ప్రాథమికంగా పబ్ నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పబ్ లో పట్టుబడిన వాళ్లో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారని, అందుకే వారిని విడిచిపెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఇప్పటి వరకు కేవలం అధికారిక టీఆర్ఎస్ పైనే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని కూడా రేవంత్ రెడ్డి వదలడం లేదని అంటున్నారు. అయితే మొదట్లో స్పీడ్ పెంచిన ఈ కేసు ఆ తరువాత పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపించారు. ఆ తరువాత విచారణ పూర్తి చేసి అసలు డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని అంటున్నారు. దీంతో ఈ కేసుపై విచారించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాలి. అయితే హైకోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని టాలీవుడ్ ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.