వర్మ ఏపీ ఎమ్మెల్యేలను వదల్లేదు..

Update: 2019-06-18 11:15 GMT
నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగోపాల్ వర్మకు ఏదో ఒక ఇష్యూ లేనిదే పూట గడవదు.. మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని పట్టుకొని చంద్రబాబు , టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన వర్మ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాస్త సేదతీరారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయించి చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకున్నాయి..

అయితే ప్రతీ చానెల్ లో లైవ్ వస్తున్న ఏపీ శాసనసభా సమావేశాలను వివాదాస్పద వర్మ కూడా చూసినట్టున్నాడు. అందుకే ఏపీ అసెంబ్లీ తీరుపై తనదైన శైలిలో పంచులు విసిరాడు. తాజాగా వర్మ ఏపీ స్పీకర్, ఎమ్మెల్యేల తీరుపై సంధించిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది.

తనకు ఏపీ అసెంబ్లీ లైవ్ చూసినప్పుడు స్పీకర్ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి వారి దూకుడును తగ్గించడానికి పదే పదే బెల్ కొడుతున్నాడని.. అ సౌండే ఎక్కువగా వినపడుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మరీ స్కూలు పిల్లల్లా పొట్లాడుకుంటుంటే స్పీకర్ ఆ బెల్ మోత మోగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ చూస్తుంటే తనకు ఎమ్మెల్యేలను స్కూలు పిల్లల్లా స్పీకర్ హెడ్ మాస్టర్ లా కనిపిస్తున్నాడని వర్మ ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తూ.. పాత చంద్రబాబు తప్పులు ఎత్తిచూపడం తప్పితే తనకు ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ పై చర్చే కనిపించడం లేదని వర్మ సూటిగా దెప్పిపొడిచారు. వర్మ చేసిన ట్వీట్ కు నెటిజన్లు కూడా భారీగా కామెంట్ పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ చూస్తే మాకు రక్తం మరుగుతోందని కొందరు.. అసెంబ్లీ మీటింగ్ లు ఇలానే ఉంటాయి వర్మ గారు కొందరు అని కామెంట్ చేశారు.


Tags:    

Similar News