'ఇలాగే పేలితే హార్ట్ ఎటాక్ వచ్చి చస్తావ్'.. పట్టాభి పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ''వ్యూహం'' మరియు ''శపథం'' అనే సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఈ రెండు చిత్రాలను ప్రకటించడం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశగా మారింది.
ఆర్జీవీ తీయబోయే 'వ్యూహం' 'శపథం' సినిమాలు జగన్ కి అనుకూలంగా ఏపీ రాజకీయాలపై ఉండబోతున్నాయని చర్చలు జరుగుతున్నాయి. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = 'వ్యూహం' అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేత పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ఆర్జీవీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకోదల్చుకోలేదని పట్టాభి అన్నాడు. ఆర్జీవీ ఒక ఫ్లాప్ డైరెక్టర్ అని.. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని సినిమా తీయించుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకునే పరిస్థితికి జగన్ దిగజారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ ఫీల్డ్ లో వర్మ పరిస్థితి ఏంటో.. రేపు పొలిటికల్ ఫీల్డ్ లో జగన్ పరిస్థితి కూడా అదేనని పట్టాభి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పట్టాభి కి ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకుంటున్నట్లు.. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. పట్టాభిని రసగుల్లా తో పోల్చుతూ వర్మ సెటైర్లు వేశారు.
''వాడేవాడో టీడీపీలో ఆడి పొజిషన్ ఏంటో నాకు తెలియదు. పట్టాభి పాము.. పట్టాబి భీమ్.. ఏదో ఉంది వాడి పేరు. ఆడు బొద్దుగా ముద్దుగా.. కొంచెం రసగుల్లాలా ఉంటాడు. రేయ్ రసాగుల్లా.. నేను అసలు జగన్ గారిని కలిశానా? ఎందుకు కలిశాను? ఏమీ తెలియకుండా నువ్వు అలా మాట్లాడితే ఎలా?'' అని ఆర్జీవీ ప్రశ్నించారు.
''నువ్వు ఒకటి ఆలోచించమ్మా.. నేను బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సినిమా తీస్తాను అనుకున్నప్పుడు.. నువ్ హ్యాపీగా ఉండాలి కానీ.. టెన్షన్ ఎందుకు ఫీలవుతున్నావమ్మా?. రసగుల్లా అనేది మెత్తగా, జ్యూసీగా, తియ్యగా ఉంటుంది. నువ్వేమో చక్కెర, బెల్లంలో కూర్చోకుండా.. మిరపకాయలా ఫీలైపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చాలా చండాలంగా ఉంది''
''నువ్వు హైరానా పడి బీపీ, షుగర్ ఎక్కువైతే చస్తావ్.. కొంచెం చూసుకోమ్మా రసగుల్లా. ఎందుకంటే రసగుల్లా ఫేస్ రసగుల్లాలా ఉండాలి కానీ.. మిరపకాయ్ లా యాక్ట్ చేయకూడదు.. అర్ధమైందా అమ్మా. నాకు నీ మీద కోపం లేదు.. ఏమీ లేదు. జాలి కలుగుతోంది. నిన్ను చూస్తేనే బుగ్గ గిల్లాలని అనిపిస్తుంది. తెల్లగా బొద్దుగా అంత ముద్దొస్తావ్''
''రసాగుల్లా.. నీకు ఒకటే చెప్తున్నా. నేను ఒక మనిషి పేరు గానీ.. సినిమా గురించి కానీ ఏమీ చెప్పనప్పుడు.. నీకు నువ్వే ముందే ఊహించేసుకొని.. భయపడిపోయి మీ పార్టీ వాళ్ళందరినీ భయపెడుతున్నావ్. నేను నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నాకు స్వీట్లంటే ఇష్టం. అందుకే నువ్ నాకు నచ్చావ్. నిజంగా రసగుల్లా తర్వాత నీ ఇంత బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక పదార్థాన్ని నేను చూడలేదు''
''అందుకనే స్వీటూ.. నా మాట విని ఇంకో రెండు రసాగుల్లాలు ఎక్కువ తిని ఇంట్లో కూర్చో. ఇలాగే పొలితే బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చి చస్తావ్ స్వీటూ. ఇదొక్కటి అర్థం చేసుకోమ్మా. ఎవరికీ నీ అవసరం లేదు కానీ.. ఇంట్లో వాళ్లకు నీ అవసరం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకే రసాగుల్లా కొంచం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా'' అంటూ ఆర్జీవీ ఆడియో రూపంలో పట్టాభి మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి దీనిపై పట్టాభి ఎలా స్పందిస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.