దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఏదైనా ఇష్యూని వర్మ టేకప్ చేస్తే జీడిపాకంలాగా తన లాజిక్కులతో దాన్ని సాగదీసి ఓ కొలిక్కి తేవడం తెలిసిందే. ఈ కోవలోనే ఏపీ సర్కార్ కు వర్మ సంధించిన 10 ప్రశ్నలపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. అయితే, వర్మ కూడా తనదైన రీతిలో పేర్ని నానికి దీటుగా జవాబిచ్చారు. దీంతో, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్, చట్టం చెప్పాయంటూ వర్మకు నాని కౌంటర్ ఇచ్చారు. దానిని డిమాండ్, సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ నాని ప్రశ్నించారు. సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేయకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తున్నాయని నాని చెప్పారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని, ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడే వర్మ ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించాలంటూ చురకలంటించారు.
అయితే, నాని కామెంట్లకు వర్మ కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. చాలా మంది లీడర్లలాగా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానమిచ్చినందుకు నానికి వర్మ థ్యాంక్స్ చెప్పారు. రూ.100 టికెట్ ని రూ.1000కి అమ్ముకోవడం అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరాన్ని బట్టి ఉంటుందని వర్మ అన్నారు. పేదవారిని ప్రభుత్వం ధనికుల్ని చెయ్యడానికి పని చెయ్యాలని, ధనికుల్ని పేదలను చెయ్యకూడదని సెటైర్ వేశారు. ఒకవేళ అలా చేస్తే ఇండియాలో కల్లా పేద రాష్ట్రం ఏపీ అవుతుందని కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ సినిమాకి, సంపూర్ణేశ్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అని షాకింగ్ కామెంట్లు చేశారు. థియేటర్‌లో ప్రేక్షకుల సౌకర్యాల ఆధారంగా టికెట్ రేటు నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టంలో ఉందని వర్మ అన్నారు.
థియేటర్లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియాను బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారని వర్మ ప్రశ్నించారు. వివిధ హోటళ్లలో ఆ హోటల్ వాళ్లు, వాళ్లిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారని, అలాగే సినిమా టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు.
సినిమా థియేటర్లు కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలని, ప్రజా సేవ కోసం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదని, కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగాలని ఆర్జీవీ చురకంటించారు.
సినిమాని తాము నిత్యావసర వస్తువుగా పరిగణించడం లేదని నాని చెప్పడంపై వర్మ స్పందించారు. కానీ, సినిమా నిత్యావసర వస్తువు అని చెప్పింది వైసీపీ నాయకులేనని, కాబట్టి అసలు ఈ డిస్కషన్ ఎందుకు అంటూ వర్మ ప్రశ్నించారు. మీ పార్టీలో కొందరు మిగతా లీడర్లలాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోసారి నా ధన్యవాదాలు అని వర్మ ట్వీట్ చేశారు. మరి, వర్మ ట్వీట్ పై నాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.