వివాదాలనే తన కథలుగా అన్వయించుకుంటూ సినిమాలు చేయడం రామ్ గోపాల్ వర్మకు గత కొంత కాలంగా అలవాటుగా మారింది. ఇటీవల ఏపీ టికెట్ రేట్ల విధానంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్రించిన వర్మ ఉన్నట్టుండి వార్తల్లో నిలిచారు. వెంటనే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టన్ పేర్ని నానిని అపయింట్ మెంట్ కోరడం, వెంటనే అటు నుంచి యస్ అంటూ ఆన్సర్ రావడం.. విజయవాడ వెళ్లి వర్మ మిస్టర్ పేర్ని నానితో ప్రత్యేకంగా భేటీ అయి టికెట్ రేట్లపై చర్చించి బిర్యానీ తిని రావడం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ని నిశితంగా పరిశీలించిన ఆంధ్ర జ్యోతి ఎండీ రాధాకృష్ణ .. తన `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` టాక్ షోకు ఆహ్వానించారు.
వెంటనే ఓకే చెప్పిన వర్మ `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` టాక్ షో లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. వర్మ, రాధాకృష్ణ మధ్య జరిగిన సంవాదం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ .. వర్మని అడ్డంగా బుక్ చేయడమే కాకుండా రామ్ గోపాల్ వర్మలో లౌక్యమే కాకుండా పిరికితనం కూడా వుందని స్టేట్ మెంట్ కూడా ఇవ్వడంతో ఈ ప్రోమో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రోమో స్టార్టింగ్ లోనే రాధాకృష్ణ .. వర్మపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. `ఏంటీ మాంచి కౌబాయ్ లా తయారయ్యారు.. రంగు రంగుల బూట్లు... అనగానే వర్మ నవ్వుతూనే `చాలా యంగ్ పీపుల్ పక్కన పెట్టుకుని పని చేస్తావుంటే మనం ఇంకా యంగ్ గానే వున్నామనే అపోహ కలుగుతుంది అని అంటుండగానే .. రాధాకృష్ణ కలగజేసుకుని యంగ్ పీపులా? యంగ్ గాళ్సా అని కౌంటర్ ఇచ్చారు. దీనికి వర్మ పెద్దగా నవ్వేశాడు. `చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.. అప్పుడు చేయలేనవి ఇప్పుడు చేస్తున్నారా? అని రాధాకృష్ణ అడిగితే...
వయసు పెరిగినా కొద్దీ నాకు జ్ఞానం పెరుగుతోంది అనుకుంటున్నా... బుద్ధుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టుగా నాకు ఓ బార్ లో జ్ఞానోదయం అయింది` అన్నారు వర్మ.. వెంటనే అది ఏ బారది .. అంత పుణ్యం చేసుకున్న బార్ అదీ? అంటే జ్ఞానం కావాల్సిన వాళ్లు అక్కడికి పోతారు అని రాధాకృష్ణ స్మూత్ గా పంచ్ వేయడంతో వర్మ నవ్వడం మొదలుపెట్టారు. ఇక వెంటనే `అప్పుడప్పుడు వర్మలో షాడిస్టు కూడా వుంటాడు. ఇతరుల మనోభావాలని దెబ్బతీయొద్దూ అన్నారు. అనగానే వర్మ.. నాకు మీ ముఖం నచ్చలేదు అని చెప్పానిప్పుడు దీనిమీద కేసు పెట్టండి చూస్తాను` అని కౌంటరిచ్చాడు.
పైలా పశ్చీస్,, కౌబాయ్ లా వుండే వర్మలో సడన్ గా ట్రేడ్ యూనియన్ లీడర్ ఎలా బయటికి వచ్చాడు? అని రాధాకృష్ణ ప్రశ్నించగానే ...`ఫస్టఫాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది వుండదు..కళామతల్లి బిడ్డలమని డైలాగ్ కోసమే చెబుతుంటారు. ఒకళ్లమీద ఒకళ్లకు వున్నంత జలసీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ గ్రూపులో వుండదు` అని స్టేట్ మెంట్ ఇచ్చేశాడు వర్మ.. ఆ తరువాత వర్మ రెండు ట్వీట్ లు పెట్టగానే అపాయింట్ మెంట్ వచ్చేసింది ఏంటీ? అని రాధా కృష్ణ అడగ్గానే `నాలాగా ఒక్కరన్నా ట్వీట్ పెట్టారా? నాకు అర్జెంట్ గా అపాయింట్ మెంట్ కావాలని ఎవరడిగారు చెప్పండి? అని ఎదురు ప్రశ్నించాడు వర్మ.
దీనికి రాధాకృష్ణ `అందరూ వర్మలాంటి తిక్కలోళ్లు అయివుండరు కదా?` అంటూ దిమ్మదిరిగే కౌంటర్ వేశాడు వర్మకు. జగన్‌మోహన్ రెడ్డి టికెట్ రేట్లంటూ దారి ఏర్పరిచాడు. రేపు ఇంకో తిక్కల ముఖ్యమంత్రి వస్తాడు. అంతకంటే తిక్కలోడు అయివుండొచ్చు..టికెట్ రేటు పది పైసలే అంటాడు ఏంచేస్తారు? అని వర్మని ప్రశ్నించారు రాధాకృష్ణ. గవర్నమెంట్ జోక్యాన్ని ప్రశ్నించకపోతే రేపు బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది` అని వర్మ అనగానే అది మీకు అస్సలు నచ్చదు కదా అని రాధాకృష్ణ నవ్వేశారు.
మీకు బలిసిందా? అని అడిగితే .. మేం బలిసి కొట్టుకుంటున్నాం అంటే నువ్వు బలవకుండానే ఎమ్మెల్యేవి అయ్యావా? అని వర్మ వైసీపీ ఎమ్మెల్యేకి కౌంటర్ వేశారు. చంద్రబాబు సీఎంవగా వున్నప్పుడు `లక్ష్మీస్ ఎన్టీఆర్` అని సినిమా తీశారు. ఇప్పుడు జగన్ మీద అలాంటి సినిమా తీయగలరా? అని రాధాకృష్ణ సూటిగా వర్మని అడిగితే నో ఆన్సర్. జగన్‌మోహన్ రెడ్డి మీద మీకు అపారమైన ప్రేమ వుంది కదా చేయొచ్చు కదా? అంటే వర్మ హావ భావాలు స్రైస్ లెస్. వర్మ ఓడ్కా వేసుకుని కూర్చుంటే కథ ఎంత సేపు... వివేకా నందరెడ్డి హత్య గురించి చెబుతా సినిమా తీస్తారా? అని అడిగితే వర్మ పెదుం కొరుకుతూ.. ఫోన్ నొక్కుతూ పట్టించుకోనట్టుగా కనిపించాడు.
దీంతో వర్మపై మళ్లీ కౌంటర్ వేశారు రాధాకృష్ణ. ఫోన్, పెదం కొరుక్కోవడం.. ఈ రెండు సైమల్ టెనియస్ గా జరుగుతుంటాయా? .. అని సీరియస్ అయ్యారు రాధాకృష్ణ. అదేంటీ అది నా ఇష్టం. మీరెవరు నాకు రూల్ పెట్టడానికి అని వర్మ రివర్స్ కావడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచినట్టుగా తెలుస్తోంది. రామక్ష గోపాల్ వర్మలో లౌక్యమే కాదు పిరికి తనం కూడా వుంది` అని రాధా కృష్ణ ప్రోమో ఎండింగ్ లో అంటుంటే వర్మ హావ భావాలు వర్ణించడానికి పదాలు రావడం లేదు.. ఆ రేంజ్ లో తన చూపులతోనే కౌంటర్ ఇచ్చినంట పని చేయడం హైలైట్ గా నిలిచింది. ప్రోమోనే ఈ రేంజ్ లో వుంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకేరేంజ్ లో వుంటుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే హాట్ చర్చ మొదలైంది.
Full View