సామాన్యుడికి 1000.. సీఎంకు ఎంత జరిమానా?

Update: 2021-04-16 08:30 GMT
ఎప్పుడూ ఎవరో ఒకరిపై విమర్శలు సంధించే రాంగోపాల్ వర్మలోనూ సామాజిక సృహ ఉందన్న విషయం తాజాగా బయటపడింది. లేనిపోని వివాదాలన్నీ కొని తెచ్చుకొని పూర్తి స్వార్థ చిత్తంతో ఆలోచించే వర్మను తిట్టని వారు ఉండరంటారు. కానీ తొలిసారి కరోనా కల్లోలం వేళ కుంభమేళా నిర్వహిస్తూ  ఓ సీఎం  వ్యవహరిస్తున్న తీరును రాంగోపాల్ వర్మ కడిగేశాడు. ఈ వివాదాస్పద దర్శకుడు భక్తి ముసుగులో కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ సీఎంను నిలదీశాడు. ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సూటిగా.. సుత్తిలేకుండా వర్మ విమర్శలు గుప్పించాడు. ‘మాస్క్ ధరించనందుకు సామాన్యుడికి రూ .1000 జరిమానా విధిస్తున్న ప్రభుత్వాలు.. కుంభమేళా నిర్వహిస్తూ లక్షలమంది మాస్కులు పెట్టుకోకుండా అందులో తిరిగితే ఎందుకు పట్టించుకోరు.  ఉత్తరాఖండ్ సిఎం..  ఇతరులకు ఎంత జరిమానా విధించాలి?’ అని నిర్లక్ష్యాన్ని వర్మ తన ట్వీట్ లో ఎత్తిచూపారు.

కుంభమేళాలు.. రాజకీయ ర్యాలీల పేరుతో రాజకీయ నాయకులు ప్రజల ఓట్లపై చూపిస్తున్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యంపై చూపించడం లేదని  స్పష్టంగా రుజువు అవుతోందని వర్మ ఆడిపోసుకున్నాడు.. ఓటు వేసిన తర్వాత వారు ప్రజల గురించి పట్టించుకోరు’ నాయకులు ఎంతైనా తెలివిగల వారు అని వర్మ ఎద్దేవా చేశారు.

కుంభమేళా ఫలితం మొదటి 5 నిమిషాల్లో ఏం తేలదు. 23 గంటల 55 నిమిషాల తర్వాత ఫలితాన్ని చూసే వరకు వేచి ఉండండి. అప్పుడు కల్లోలం జరుగుతుందని కుంభమేళాతో ప్రబలే కరోనాపై వర్మ హెచ్చరికలు చేశారు.  సిఎం.. అధికారులందరూ లెక్కలేనన్ని మరణాలకు బాధ్యత వహించాలని వర్మ నిలదీశారు. వారందరిపై సీరియల్ మర్డర్స్ అభియోగాలు మోపాలని డిమాండ్ చేశారు. కుంభమేళాకు హాజరైన వారిని కరోనా నుంచి  ఏ దేవుడు సహాయం చేయడానికి వస్తాడో చూద్దాం?’ వర్మ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. ఎప్పుడూ సినిమాలు.. అనవసర వివాదాలు కొనితెచ్చుకునే వర్మ తొలిసారి ఇలా స్పందించేసరికి అందరూ షాక్ అవుతున్నారు.
Tags:    

Similar News