తెలుగు సీఎంలూ ఇదెందుకు ట్రై చేయకూడదు?

Update: 2018-07-27 05:40 GMT
డీమోనిటైజేషన్ తరువాత సీను కాస్త మారింది కానీ - ఏటీఎంలు వచ్చాక డబ్బు విత్ డ్రా చేయడం ఎంత సులభమైపోయిందో తెలిసిందే. ఈమధ్య ఈమధ్య పెరుగుతున్న నీటి ఏటీఎంలు కూడా ప్రజలు చాలా ప్రయోజనరంగా ఉంటున్నాయి. తాజాగా మరో ఏటీఎంలు కూడా వచ్చేశాయి.. అయితే, మన దేశంలో కాదు ఇండోనేసియాలో. ఇందులో వండుకోవడానికి బియ్యంలాంటివి వస్తాయి. అవును... ఇండోనేసియా ప్రభుత్వం రెండేళ్ల కిందట టాంజెరంగ్ పట్టణంలో తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసింది. వీటిని రైస్ ఏటీఎంలు అంటున్నారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది.
   
పేదలు వీటిని సులభంగా ఉపయోగించుకుంటుండడంతో ఆదరణ బాగా పెరిగి ఎక్కడికక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మన దేశంలో రేషన్ కార్డు ఉన్నట్లుగా అక్కడ దీనికోసం ఒక రైస్ కార్డు ఇస్తున్నారు. దాన్ని స్వైప్ చేసి ఉచితంగా 5 కేజీల బియ్యం తీసుకెళ్లొచ్చు. ఈ ఏటీఎంలో 200 కేజీలకుపైగా బియ్యం ఉంటుంది. నెలకు 8 సార్లు ఒక్కో మిషన్ నింపుతారు. వీటిని ఏర్పాటు చేశాక ఆహార సరఫరా విభాగంలో అవినీతి బాగా తగ్గిందట.
   
తెలుగు రాష్ట్రాల్లో అమలు ఎలా ఉన్నా పథకాలు మాత్రం ఘనంగా ప్రారంభించే రెండు ప్రభుత్వాలూ ఇలాంటి వినూత్న పద్ధతులను పరిశీలిస్తే బాగుంటుందన్నసూచనలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్స్ విధానంలో పంపిణీలో సంక్లిష్టతను చాలావరకు అరికట్టడానికి ఇది ఉపయోగపడొచ్చు.
Tags:    

Similar News