గత శని,ఆదివారాల్లో ఐపీఎల్ 2018 వేలంపాట ముగిసిన సంగతి తెలిసిందే. అంచనాలకు మించి కొందరు అధిక ధరకు అమ్ముడు పోతే....భారీ అంచనాలున్న గేల్ వంటి వారు కనీస ధరకు అమ్ముడవడం సంచలనం రేపింద. అయితే, ఈ బిడ్డింగ్ మొత్తాన్ని నిర్వహించిన ఆక్షనిస్ట్ వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వేలంపాటను రక్తి కట్టించడంలో అతడిదే కీలక పాత్ర. గత పదేళ్లుగా విజయవంతంగా ఆక్షనిస్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిచర్డ్ మ్యాడ్లీ....ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. వేలం ముగిసిన తర్వాత స్వదేశానికి వెళుతున్న సందర్భంగా అతడు..తన ట్విట్టర్ ఖాతాలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.
బీబీసీలో ఓ గేమ్ షోకు వేలం నిర్వహించే మ్యాడ్లీ బాగా పేరు పొందాడు. దీంతో, బీసీసీఐ మ్యాడ్లీని ఏరికోరి ఐపీఎల్ వేలానికి ఆహ్వానించింది. అందుకే అరంగేట్ర ఐపీఎల్ నుంచి ఈ ఏడాది వరకు అతడే ఆక్షనిస్ట. వరుసగా పదేళ్ల నుంచి ఐపీఎల్ ఆక్షనిస్ట్ గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మ్యాడ్లీ వచ్చే ఏడాది కూడా అలరించనున్నాడు. గంటల కొద్దీ గొంతును ఒకే స్థాయిలో ఎలా పలకగలరని ఓ అభిమాని మ్యాడ్లీకి ట్వీట్ చేశాడు. తాను ఆల్కహాల్ తీసుకుని ఒక టెంపోను మెయింటైన్ చేస్తానని చెప్పాడు. తన లాగే ఆక్షనీర్ అవడానికి షార్ట్‌కట్ లు లేవని, గదులు ఊడ్చే స్వీపర్ స్థాయి నుంచి టాప్ ఆక్షనిస్ట్ స్థాయికి చేరుకున్నానని, దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేశానన్నాడు. కష్టపడితే సాధించలేనిదేమీలేదని బదులిచ్చాడు.