రెండు గరుడ ప్లస్ బస్సుల్లో పట్టే మంది కంటే తక్కువ మంది దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? ఈ విషయం తెలుసుకుంటే నోటి వెంట మాట రాని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవటమే కాదు.. సంపన్నుడు మరింత స్ట్రాంగ్ అయిపోతున్నాడు.ఇక.. పేదోడి బతుకులు పేదగానే ఉండిపోతున్నాయి. అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నా.. వాటి ఫలాలు.. ప్రయోజనాలు పొందుతున్న వారు మాత్రం గుప్పెడు మంది మాత్రమే కావటం గమనార్హం.
ప్రపంచంలోని ఆస్తి మొత్తంలో సగం కేవలం 62 మంది దగ్గరే పోగుపడటం చూస్తే.. సంపన్నులు ఎంత స్ట్రాంగ్ అవుతున్నది ఇట్టే అర్థమవుతుంది. ఏడాదికేడాది గడిచే కొద్దీ సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారు. ఈ వాదన నమ్మబుద్ధి కాకపోతే.. ఆక్స్ ఫామ్ చేసిన అధ్యయన వివరాలు చూస్తే కఠిన నిజం కళ్ల ముందు కనిపించక మానదు. 2010లో ప్రపంచంలోని సగం సంపద 388 మంది దగ్గర పోగుపడి ఉంటే.. 2011 నాటికి 177కి పడిపోయింది. ఇక.. 2012 వచ్చేసరికి 159 మందికి పరిమితమైతే.. 2013 నాటికి 92 మందికి కుంచించుకుపోయింది. ఇక.. 2014 నాటికి 80కి.. 2015 పూర్తి అయ్యేసరికి ప్రపంచంలోని సగం సంపద కేవలం 62 మంది వచ్చే రాశులు.. రాశులుగా పేరుకుపోవటం గమనార్హం.
మొత్తం ప్రపంచ జనాభా సుమారు 370 కోట్ల మంది ఉంటే.. అందులో సగం మంది దగ్గరున్న ఆస్తి.. కేవలం 62 మంది దగ్గర ఉండటం షాక్ అనిపించక మానదు. ఈ అపర కుబేరుల ఆస్తి మొత్తం (62 మందిది) లెక్కేస్తే వచ్చే మొత్తం రూ.1,19,15,983 కోట్లుగా తేలింది. కేవలం రెండు విలాసవంతమైన బస్సుల్లో ప్రయాణించే వారి కంటే తక్కువ మంది దగ్గర ప్రపంచ ప్రజల్లోని సగం మంది దగ్గర ఉండే ఆస్తికి సమానంగా ఉండటం ఆధునిక నాగరిక దుర్మార్గంగా భావించాలా?