దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశరాజధాని న్యూ ఢిల్లీలో పోటీచేసే వారిపైన ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. రాజధాని ఢిల్లీ పరిధిలో పోటీచేస్తున్న లోక్ సభ అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు.
గంభీర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అతడి ఆస్తులు రూ.147కోట్లు. గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరుఫున పోటీచేస్తున్నాడు.
ఇక ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ కూడా పోటీచేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.24కోట్లు. ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయాన్ని రూ.48.03కోట్లుగా చూపించారు.
దక్షిణ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి తన ఆస్తులను రూ.18కోట్లుగా చూపించాడు. అఫిడవిట్ ప్రకారం ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.3.5కోట్లు పెరిగాయి.
దక్షణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న విజేందర్ సింగ్ తన ఆస్తులను రూ.3.57 కోట్లుగా చూపించాడు. ఇక మాజీ సీఎం షీలా దీక్షిత్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్నారు. ఈమె తన ఆస్తులను రూ.4.92 కోట్లుగా చూపించాడు.
రాజధాని ఢిల్లీ పరిధిలో పోటీచేస్తున్న అందరిలోకి స్థిర, చర ఆస్తులను పరిగణలోకి తీసుకుంటే గౌతం గంభీరే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆయన ఆస్తులు రూ.147 కోట్లుగా చూపించాడు. తనపై ఓ కేసు కూడా ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇందులో స్థిర ఆస్తులు రూ.28కోట్లుగా, చర ఆస్తులు రూ.116 కోట్లుగా చూపించారు.