స్టాలిన్ టీంలో అత్యంత సంపన్న మంత్రి అతడేనట.. ఎంత ఆస్తి అంటే?

Update: 2021-05-13 10:33 GMT
తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ఎట్టకేలకు తీర్చుకున్నారు స్టాలిన్. 68 ఏళ్ల వయసులో ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ముప్ఫై మూడు మంది మంత్రులతో కొలువు తీరిన ఆయన మంత్రివర్గానికి సంబంధించి ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తన కేబినెట్ లో దాదాపు యాభై శాతం వరకు తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు కాగా.. ఇద్దరు మహిళా నేతలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు.

ఇక.. మంత్రుల్లో అత్యంత సంపన్న మంత్రిగా రాణిపేట ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీగా చెప్పాలి. తాజాగా ఆయన చేనేత.. జౌళి.. ఖాదీ..గ్రామ పరిశ్రమల బోర్డు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనే మంత్రులందరిలోకి అత్యంత సంపన్నుడిగా ఆయన సమర్పించిన ఎన్నికల పత్రాల్లో ఉంది. ఇంతకూ ఆయన ఆస్తులెంత? అంటారా? అధికారిక లెక్కల ప్రకారం రూ.47.94 కోట్లు. అయితే.. ఈ మంత్రిగారిది మరో ప్రత్యేకత కూడా ఉంది.

ఆస్తుల్లోనే కాదు.. అప్పుట్లోనూ ఆయనకే ముందున్నారు. మొత్తం మంత్రుల్లో అత్యధిక అప్పు ఉన్న మంత్రిగా ఆయనే నిలిచారు. ఆయనకు మొత్తం రూ.14.46 కోట్ల అప్పు ఉన్నట్లుగా తేలింది. ఇక.. మంత్రివర్గంలో తక్కువ ఆస్తులున్న మంత్రిగా ఐటీ శాఖా మంత్రి మనో తంగరాజ్ నిలిచారు. ఆయన ఆస్తి కేవలం రూ.23.39 లక్షలు మాత్రమే కావటం గమనార్హం. మిగిలిన 31 మంది మంత్రులు కోటీశ్వరులే. మొత్తంగా తమిళనాడు మంత్రులంతా మాంచి స్థితిమంతులే సుమా.
Tags:    

Similar News