పదేళ్ల క్రితం కొత్త కానీ.. ఇప్పుడు ఆన్ లైన్ లో ఆటో.. క్యాబ్ బుక్ చేసుకోవటం చాలా సులువుగా మారాయి. ఓలా.. ఊబర్ లాంటి సంస్థలు దేశంలో ఎంట్రీ ఇచ్చి.. తొలుత మహానగరాల్లో.. ఆ తర్వాత టైర్ టూ సిటీస్ లో తమ సేవల్ని షురూ చేయటం తెలిసిందే. మొదట్లో భారీ రాయితీలతో ఆకర్షించటం తెలిసిందే. దీంతో డ్రైవర్లు.. ఇటు ప్రయాణికులు క్యాబ్ ల మీదా.. ఆటోల మీదా ఆధారపడటం మొదలైంది.కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులు.. ప్రయాణికులకు సేవల కంటే కూడా తమ లాభాలే ప్రధానంగా మారిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు.
కరోనా వేసిన దెబ్బతో క్యాబ్ లు చాలావరకు వెళ్లిపోయాయి. దీనికి తోడు పెరిగిపోయిన పెట్రోల్.. డీజిల్ ధరలతో వర్కువుట్ కాకపోవటం.. ఓలా.. ఉబర్ సంస్థలు డ్రైవర్ల వద్ద వసూలు చేసే కమిషన్లు వెరసి.. క్యాబ్ లు.. ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
బుక్ చేసిన వెంటనే వాహనం రాకపోవటం.. వచ్చినా క్యాష్ ఇస్తారా? ఆన్ లైన్ పేమెంట్ అయితే రామని తేల్చేయటం.. గమ్యస్థానం ఎక్కడో తెలుసుకొని మాత్రమే రైడ్ కు రావటం.. లేదంటే క్యాన్సిల్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. రైడ్ కోసం బుక్ చేసిన వెంటనే వాహనం రాకపోవటం.. రావటానికి ముందు సదరు డ్రైవర్ అవసరాల్ని ఏకరువు పెట్టి.. అన్నింటికి ఓకే అన్న తర్వాతే వస్తున్నారు.
దీంతో.. రైడ్ బుక్ చేసుకోవటం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. ఇలాంటివేళ.. క్యాబ్ డ్రైవర్లు.. వాటి సేవల్ని అందించేసంస్థల తీరుతో విసిగిపోయిన ఒకరు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. రామాంతపూర్ కు చెందిన రాజ్ కుమార్ ఉబెర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ యాప్ను కొంతకాలంగా వినియోగిస్తున్నారు. ట్రిప్ కోసం బుక్ చేసుకున్న వెంటనే డ్రైవర్లు క్యాన్సిల్ చేయటం.. కానీ దాని భారం తన మీద వేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ట్రిప్ ల రద్దు ఒకవైపు.. తమ తప్పు లేకున్నా ట్రిప్ క్యాన్సిల్ చార్జీల్ని కట్టాల్సి రావటాన్ని ప్రశ్నిస్తూ..హైదారాబాద్ వినియోగదారుల హక్కుల ఫోరం 1ను ఆశ్రయించారు. పాలసీ ప్రకారం ఉబర్ సంస్థ ప్రయాణికుడు రైడ్ ను రద్దు చేస్తే 10 శాతం మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. అందుకువిరుద్దంగా రాజ్ కుమార్ నుంచి రెండుసార్లు రూ.27.44, రూ.37.44 మొత్తాన్ని వసూలు చేశారు. అంతేకాదు బుకింగ్ చేసిన మూడు నిమిషాల తర్వాత రైడ్ రద్దు చేస్తే రూ.50వరకు వసూలు చేయటాన్ని ప్రశ్నించారు.
దీనిపై వాదనలు జరిగాయి. దీంతో బాధితుడి వాదనను పరిగణలోకి తీసుకున్న బెంచ్.. రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు.. అందులో ప్రయాణికుడి తప్పేం లేనప్పుడు ఛార్జీలు వసూలు చేయటం అనైతికమని.. అది సరికాదంటూ ఉబెర్ ను తప్పు పట్టింది. ఉబెర్ సంస్థ పాలసీని మార్చుకోవాల్సిందిగా సూచన చేసింది. ఫిర్యాదుదారుడు నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.