ఒకటికాదు రెండు కాదు.. సుదీర్ఘకాలం తన జాతి హక్కుల కోసం పోరాడిన ఉక్కుమహిళ ఆ మధ్యన ప్రేమ వివాహం చేసుకోవటం తెలిసిందే. ఆమె వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో తాను ఏ గడ్డ మీద తన వారి హక్కుల కోసం పోరాడారో.. అక్కడ నుంచి సదూరంగా వెళ్లిపోవాల్సిన సిత్రమైన పరిస్థితిని ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ఎదుర్కొంటున్నారు. మణిపూర్ లోని సాయుధ బలగాల ప్రత్యేక చట్టం రద్దు చేయాలని 16 ఏళ్ల పాటు దీక్ష చేసిన వైనం తెలిసిందే.
తన పోరాటానికి స్వస్తి పలికిన ఆమె.. ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. దీనిపై మణిపూర్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. భర్తతో కలిసి తమిళనాడుకు వెళ్లిపోయారు ఇరోం షర్మిల. తాజాగా ఆమె మదర్స్ డే రోజున ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన విషయం మీడియాలో వచ్చేసింది.
అయితే.. ఆ పిల్లల ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా తన పిల్లల ఫోటోల్ని విడుదలయ్యాయి. పిల్లలతో పాటు ఇరోమ్ దంపతులున్న ఫోటోల్ని బయటకు విడుదల చేశారు. నిక్స్ సఖి.. ఆటం తారా పేర్లను ఆ చిన్నారులకు పెట్టారు. పిల్లలు ఇద్దరు రెండుపాతిక.. రెండు కేజీల పదహారుగ్రాముల బరువు ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వారికి వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు శ్రీపాద వినెక్కర్ వెల్లడించారు.
మల్లేశ్వరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఇరోమ్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గోవాలో పుట్టి బ్రిటీష్ జాతీయత కలిగిన డెస్మండ్ కొటిన్హోను ఇరోమ్ షర్మిల పెళ్లాడారు.