రియోలో జరిగే ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు నుంచే వార్తల్లో నిలుస్తోంది. బ్రెజిల్ అంటేనే ఆహ్లాదంగా గడపాలనుకునేవారికి అనువైన స్థలం అనేది తెలిసిందే. అయితే తాజాగా ఒలింపిక్స్‌కు వచ్చే అథ్లెట్ల కోసం ఆ దేశం చేసిన ఏర్పాట్లు చూస్తే దిమ్మ తిరిగి పోతోంది. రియోలో అథ్లెట్ల కోసం నిర్మించిన ప్రత్యేక గ్రామాన్ని ఇటీవలే ప్రారంభించగా ఆ గ్రామం విశేషాలు షాకింగ్ గా ఉన్నాయని అంటన్నారు.
ఈ అథ్లెట్ విలేజ్ లో 24 గంటలు తెరిచి ఉండే రెస్టారెంట్ ను అత్యంత విశాలంగా నిర్మించారు. అథ్లెట్ విలేజ్ లో మొత్తం 31 బిల్డింగ్ లను నిర్మించారు. వాటిల్లో సుమారు 18 వేల మంది అథ్లెట్లు బస చేయవచ్చు. గేమ్స్ విలేజ్ లో ఉన్న రెస్టారెంట్ అత్యంత భారీగా ఉన్నట్లు సమాచారం. ఎంత విశాలంగా ఉందంటే అది అయిదు ఎయిర్ బస్ విమానాలు పట్టే అంత పెద్దగా ఉందంటున్నారు. ఆ రెస్టారెంట్ లో ప్రతి రోజూ 210 టన్నుల ఆహారాన్ని అథ్లెట్లకు అందించనున్నారు. ఆ విలేజ్ లాంజ్ లో భారీ సంఖ్యలో కండోమ్ లను పెట్టనున్నారట. సుమారు నాలుగున్నర లక్షల కండోమ్ లు నిత్యం అందుబాటులో ఉండనున్నాయట!
ఇదిలాఉండగా బ్రెజిల్ లో జికా వైరస్ భయాందోళనలు ఉన్న కారణంగా ప్రతి బెడ్ రూమ్ కు దోమతెరలను అందుబాటులో ఉంచుతున్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు రకరకాల మతస్థులు వస్తుంటారు కాబట్టి, వాళ్లు ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యేక మందిరాలను ఏర్పాటు చేశారు. అయితే క్రీడాకారులు బస చేసే రూమ్ ల్లో టీవీలను ఫిక్స్ చేయడంలో విఫలమయ్యారని సమాచారం. నిధులు సరిగా లేని కారణంగా టీవీలను అథ్లెట్ల రూముల్లో పెట్టలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ క్రీడాకారులు గేమ్స్ గురించి అప్ డేట్స్ తెలుసుకోవాలంటే వాళ్లు ప్రతి బిల్డింగ్ లాంజ్ లో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ల మీదే ఆ వివరాలను ఫాలో కావాల్సి ఉంటుంది.