సీబీఐ కొత్త బాస్ బ్యాక్ గ్రౌండ్ ఇదండి!

Update: 2019-02-03 05:49 GMT
సీబీఐ చీఫ్ ను నియ‌మించే విష‌యంలో ఇటీవ‌ల కాలంలో చోటుచేసుకున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. మోడీ స‌ర్కారుకు న‌చ్చ‌ని అలోక్ వ‌ర్మ‌ను బ‌య‌ట‌కు పంపేసి.. ఆయ‌న స్థానంలో ఇంఛార్జిగా తెలుగోడైన మ‌న్నెం గోపీచంద్ ను నిమించ‌టం.. అనంత‌రం ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం.. మొత్తంగా మోడీ స‌ర్కారు ప‌రువు బ‌జారున ప‌డ‌టం తెలిసిందే.

సీబీఐ చీఫ్ నియామ‌కాన్ని ఇంత రాజ‌కీయంగా మార్చేయ‌ట‌మా? అన్న విమ‌ర్శ‌లు జోరుగా వినిపించాయి. మోడీ స‌ర్కార్ ఇమేజ్ ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన ఈ ఉదంతం ఇలా ఉంటే.. సీబీఐకి కొత్త బాస్ ను డిసైడ్ చేయ‌టంలో ఇంత ఆల‌స్యం ఏమిటంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో తాజాగా సీబీఐ డైరెక్ట‌ర్ గా మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లాను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌ధాని.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. విప‌క్ష నేత క‌లిసిన టీం సీబీఐ కొత్త బాస్  నియామ‌కాన్ని పూర్తి చేయాలి. విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే సూచించిన అధికారికి కాకుండా ప్ర‌భుత్వం మెచ్చిన రిషికుమార్ కు సీబీఐ ప‌గ్గాలు చేతికి అందించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాడ‌ర్ కు చెందిన శుక్లాకు.. అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో ప‌డ‌ద‌న్న పేరుంది. రానున్న రెండేళ్ల పాటు సీబీఐ బాస్ ప‌ద‌విని నిర్వ‌హించ‌నున్న శుక్లా బ్యాక్ గ్రౌండ్‌లోకి వెళితే.. ఆయ‌న గ్వాలియ‌ర్ నివాసి. త‌త్వ శాస్త్రంలో పీజీ చేసిన ఆయ‌న‌..  1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్.

శుక్లా ఎంపిక‌కు ముందు దాదాపు 80 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలించారు. వారిలో 30 మందితో కూడిన జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ప్ర‌ధానికి.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి.. లోక్ స‌భ‌లో విప‌క్ష నేత‌కు పంపారు. చివ‌ర‌కు రిషికుమార్ శుక్లా పేరును ఫైన‌ల్ చేశారు. గ‌తంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ డీజీపీగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇటీవ‌లే ఆయ‌న్ను రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ‌కు ఛైర్మ‌న్ గా ఎంపిక చేశారు.

ఎక్కువ‌గా మాట్లాడ‌ర‌న్న పేరుతో పాటు..రూల్ ప్ర‌కార‌మే ముందుకెళ‌తార‌న్న పేరుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని శివ‌రాజ్ సింగ్ చౌహాస్ సీఎంగాఉన్న వేళ‌.. స‌ర్కారుతో శుక్లా ఘ‌ర్ష‌ణ ప‌డిన‌ట్లుగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే ఆయ‌న్ను డీజీపీ ప‌ద‌వి నుంచి అప్రాధాన్య‌త పోస్ట్‌కు పంపారు. అలాంటి ఆయ‌న్ను సీబీఐ చీఫ్ గా ఎంపిక చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. రుషికుమార్ శుక్లా నియామ‌కాన్ని కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే త‌ప్పుప‌ట్టారు. సీబీఐ చీఫ్ ఎంపిక‌కు సీనియార్టీ ఒక్క‌టే స‌రిపోద‌ని.. అవినీతి కేసుల్ని విచారించ‌టంతో అనుభ‌వం లేద‌ని ఫైర్ అయ్యారు. సీబీఐ బాస్ ఎంపిక విష‌యంలో ఆల‌స్యం ఎందుక‌వుతుందంటూ సుప్రీంకోర్టు శుక్ర‌వారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా.. శ‌నివారంనాడు కొత్త చీఫ్ ను ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News