బ్రిటన్ లో తలెత్తిన రాజకీయ అస్థిరతకు మరికొద్ది రోజుల్లోనే తెరపడనుంది. బ్రిటన్‌లో కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ పేరు మరోసారి ముందంజలో ఉంది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన ఓ కీలక సర్వే.. ఫలితాలు వెల్లడించింది. సునాక్‌కు 100 మంది ఎంపీలు మద్దతిస్తున్నట్టు తెలిపింది. ప్రధాని పీఠం పొందేందుకు.. 100 మంది ఉంటే సరిపోతుందని.. మెజారిటీతో విజయం దక్కించుకుని ప్రధాని పగ్గాలు చేపట్టేయడం.. సునాక్‌కు కలిసి వస్తుందని పేర్కొంది.
కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతోన్న వేళ.. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్ పేరు మరోసారి బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మంది ఎంపీలు మద్దతిస్తున్నట్లు సునాక్ మద్దతుదారులు తాజాగా వెల్లడించారు. ఇదే విషయాన్ని సర్వే కూడా పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఉండాలి. ఈ క్రమంలోనే సునాక్‌కు వంద మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఆయన పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై సునాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి పోటీ చేసేందుకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తన భార్యాపిల్లలతో ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న జాన్సన్.. హుటాహుటిన బ్రిటన్ చేరుకున్నారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 45 మంది ఎంపీలు మాత్రమే జాన్సన్‌కు మద్దతిస్తున్నారు. అయితే ప్రధాని పదవికి పోటీపై జాన్సన్ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. కానీ, ఈసారి పోటీలోకి దిగొద్దని, తనకు అవకాశం కల్పించాలని బోరిస్ జాన్సన్.. రిషి సునాక్‌ను కోరినట్లు బ్రిటిష్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరి, ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సర్వేలు మాత్రం పుంఖాను పుంఖానులుగా వస్తుండడం గమనార్హం.