తప్పుకున్న బోరిస్ జాన్సన్.. బ్రిటన్ ప్రధాని పదవికి చేరువలో మన రిషి సునాక్

Update: 2022-10-24 06:58 GMT
బ్రిటన్ ప్రధానమంత్రిగా మన భారత సంతతికి చెందిన రిషిసునాక్ కావడానికి అడుగు దూరంలో ఉన్నాడు. ప్రధాన పోటీదారుగా నిలబడుతాడని అనుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో ఇప్పుడు రిషి సునాక్ కు పార్టీలో ప్రధాని పోటీలో లైన్ క్లియర్ అయ్యింది. పోటీకి అవసరమైన 100 ఎంపీల మద్దతు కంటే ఎక్కువగా దాదాపు 142మందికి పైగా ఎంపీల మద్దతును మన రుసి సునాక్ సంపాదించాడు.

పోటీకి మొగ్గు చూపినా.. ఎంపీల మద్దతు లేకపోవడం.. దేశ ప్రయోజనాలు, కన్జర్వేటివ్ పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ప్రధాని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించాడు. సునాక్, పెన్సీ మోర్డాంట్ లలో ఎవరు ప్రధాని అయినా వారికి సహకరిస్తానంటూ బోరిస్ ప్రకటించాడు. ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తానన్నారు.

మాజీ ఆర్థిక మంత్రి అయిన రిషి సునాక్ కు రోజురోజుకు సభ్యుల మద్దతు పెరుగుతోంది. ఆయనకు 150 మంది ఎంపీల మద్దతు ఉంది. ప్రధాని పదవికి పోటీచేస్తున్నట్టు ప్రకటించిన రిషి సునాక్.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని హామీ ఇచ్చాడు. కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. గతంలో దేశం కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. కరోనా సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించానని.. తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సునాక్ కోరారు.

బలమైన బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో మన భారతీయుడైన రిషి సునాక్ తోపాటు పెన్నీ మోర్డాంట్ లే ప్రధాని పదవికి పోటీపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటీవల రాజీనామా చేసిన జుయెల్లా బ్రావరెమన్ కూడా రిషికే మద్దతు తెలిపారు.  రిషి సునాక్ ఇప్పటికే 144 మంది సభ్యుల మద్ధతు ఉంది.

ప్రత్యర్తి పెన్నీ మోర్డాంట్ కు 23 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. పార్టీ ఎంపీలు ఒక్కరికే మద్దతు ప్రకటిస్తే రిషి సునాక్ కే అవకాశాలు ఎక్కువ. సోమవారం సాయంత్రమే ఆయన్ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తారు. ఇద్దరు పోటీలో ఉంటే మాత్రం 1.7 లక్షల టోరీ సభ్యుల మద్దతు కోసం ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహిస్తారు. గెలిచిన వారినే ప్రధానిగా ప్రకటిస్తారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News