రిషి సునక్ వైపే వీస్తున్న గాలి.. తాజా ఒపీనియన్ పోల్ చెప్పిందిదే

Update: 2022-07-18 04:37 GMT
గ్రేట్ బ్రిటన్ కు కాబోయే ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రౌండ్లు ముగిసిన ఈ ఎన్నికల్లో అతడు మందంజలో ఉన్నారు. అతని అభ్యర్థిత్వంపై అక్కడి అధికార పార్టీ నేతలు ఎలా ఉన్నారు? ఏమనుకుంటున్నారు? ఆయన గెలుపునకు అవకాశం ఎంత? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. జేఎల్ పార్టర్న్స్ సంస్థ ఒపినీయన్ పోల్ ను చేపట్టింది. దీని సారాంశం ఏమంటే.. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మెజార్టీ ఓటర్లు రిషి వైపు ఉన్నట్లు వెల్లడించింది.

అంతేకాదు రిషి ప్రధానమంత్రి అయితే.. ఒక మంచి ప్రధానిగా ఉండగలరన్న కితాబు రావటం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎవరైతే ఎన్నిక అవుతారో.. వారే దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టే వీలుంది. ప్రధానిగా వ్యవహరిస్తున్న బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయటంతో ప్రధానమంత్రి పదవికి ఎన్నిక జరుగుతోంది.
ఇందులో భారత మూలాలు ఉన్నరిషీ సనక్ (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు) ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన రిషికి అనుకూలంగా పరిస్థితులు ఉన్న విషయం తాజా ఒపినీయన్ పోల్ ఫలితం వెల్లడించింది. 4400 మందికి పైగా మద్దతు ఉన్నట్లుగా బ్రిటన్ మీడియా ప్రకటించింది.ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో రిషీ 48 శాతం ఓట్లతో తొలి స్తానంలో ఉండగా.. విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న లిజ్ ట్రూజ్ 39 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

వాణిజ్య శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న పెన్నీ మార్డాంట్ కు 33 శాతం ఓట్లు లభించినట్లుగా సర్వే ఫలితాలు వెల్లడించాయి. సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నల్లో ఎక్కువ రిషికి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అతనో మంచి.. ఉత్తమ ప్రధానమంత్రి అవుతారన్న అభిప్రాయాన్ని పలువురు అభిప్రాయపడినట్లుగా సర్వే ఫలితాల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

అన్ పాపులర్ విభాగంలో రిషి మినహా మిగిలిన అభ్యర్థులందరికి ప్రతికూలంగా ఉంటే.. రిషికి మాత్రం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి జరిగిన రెండు రౌండ్లలో రిషి ముందంజలో ఉండగా. .రానున్న రౌండ్లలో మాత్రం పోటీ మరింత కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధానిగా బాధ్యతల నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్ మాత్రం..

తన పార్టీ ప్రతినిధులకు మాత్రం రిషిని ఎట్టి పరిస్థితుల్లో ప్రదానమంత్రిని కానివ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పలు కథనాల్ని విదేశీ మీడియా సంస్థలు ప్రచురించటం గమనార్హం. ఓవైపు సర్వేల్లో రిషి ముందంజలో ఉన్న వేళ.. బోరిస్ జాన్సన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News