యూనైటెడ్ కింగ్ డమ్(బ్రిటన్) లో కొంతకాలంగా వలసలు నానాటికి పెరిగిపోతున్నాయి. గతేడాదిలో వలస దారుల సంఖ్య ఒక లక్షా 73 వేల మంది ఉండగా ఆ సంఖ్య ఈ ఏడాది నాటికి ఐదు లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలోనే వలసలను వీలైనంత వరకు తగ్గించుకోవాలని బ్రిటన్ సర్కార్ భావిస్తోంది.
ఇందులో భాగంగా బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తున్న విద్యార్థులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడం కత్తి మీద సాము లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ బ్రిటన్లో కొత్త విద్య విధానాన్ని తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
యూకేలో పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు.. డిపెండెంట్ వీసాలపై వచ్చే విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టే అవకాశం లేకపోలేదు. అయితే యూకేలో ప్రాధాన్యం లేని డిగ్రీలను ఎలా నిర్ణయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మరోవైపు బ్రిటన్ లోని చాలా యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల మీదే ఆధారపడి నడుస్తున్నాయి.
ఒకవేళ బ్రిటన్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తే కొన్ని యూనివర్సిటీలు పూర్తిగా పూర్తిగా దివాళా తీయడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బ్రిటన్ కు వలస వెళ్తున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో యూకేలో వలసదారులపై ఆంక్షలు విధించడం వల్ల నష్టపోయే వారిలో భారతీయులు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గతంలో భారతీయ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూకే హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే రుషి సునాక్ ప్రధాని అయ్యాక బ్రేవర్మన్ కు తిరిగి హోంమంత్రి పదవీ దక్కడం గమనార్హం. ఏది ఏమైనా రిషి సునాక్ విదేశీ భారతీయుల విషయంలో ఎలా ముందుకు వెళుతారనేది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.