తాము అనుకున్న ప్రముఖులు.. సెలబ్రిటీల ముందు మైకు పెట్టేసి.. ఎడా పెడా ప్రశ్నలు వేయటం ఒక పద్దతి. తాము అనుకున్న వారిని అనుకున్న రీతిలో ప్రశ్నలు వేయటం మినహా.. ఎదుటి వారిని పట్టించుకోకుండా తమ ధోరణిలో తాము ప్రశ్నలు అడిగేసే పద్దతి మరొకటి. తమ కార్యక్రమానికి ఆహ్వానించిన అతిధికి ఇబ్బంది కలుగకుండా ఇంటర్వ్యూ చేయటం.. మొరటుగా.. మొండిగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ జర్నలిస్టు అన్న ట్యాగ్ ఉంటే ఏమైనా అనేయొచ్చన్న తీరు ఇటీవల కాలంలో ఎక్కువైంది.
అందుకు భిన్నంగా సాగింది ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాక్రిష్ణ తాజా ‘ఓపెన్ హార్ట్’ ప్రోగ్రాం. తాజాగా సీజన్ 3లో భాగంగా తన తొలి ఎపిసోడ్ కు దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిలను పిలిచిన ఆయన ఇంటర్వ్యూ మీద బోలెడన్ని అంచనాలు వ్యక్తమయ్యాయి.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మీడియా సంస్థకు అధినేత అయిన ఆర్కేనే స్వయంగా రంగంలోకి దిగటం.. అందునా షర్మిలతో ఇంటర్వ్యూ కావటంతో భారీ అంచనాలు వెల్లువెత్తాయి.
అయితే.. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూను నిశితంగా చూసినప్పుడు ఆర్కే కంటే కూడా షర్మిలదే పైచేయి అన్నట్లుగా సాగింది. ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో ఇంటర్వ్యూకు వచ్చే వారి మీద ఆర్కే అధిక్యత స్పష్టంగా కనిపించటంతో పాటు.. కొన్నిసార్లు ఆయన వారిని ఒకట్రెండు మాటలు అనేయటానికి కూడా పెద్దగా సందేహించరు. కానీ.. తాజా ఇంటర్వ్యూ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఒక దశలో.. ఆ విషయాన్నివదిలేద్దామన్న షర్మిల మాటకు.. ఆర్కే సానుకూలంగా స్పందించి.. విషయాల్ని వదిలేయటం కనిపిస్తుంది.
అంతేకాదు.. ఇంటర్వ్యూకు వచ్చిన వారిని ఏకవచనంలో పిలిచే ధోరణి మీద ఆర్కేను చాలామంది తప్పు పడుతుంటారు. విచిత్రంగా ఈ ఎపిసోడ్ మొదట్లో ‘నాకంటే చిన్నదానివి’ అన్న ఆయన.. ఆ తర్వాత మాత్రం.. పలు సందర్భాల్లో ‘మీరు’ అనే పిలిచారు తప్పించి.. ‘నువ్వు’ అనే మాట వినిపించకపోవటం గమనార్హం. అంతేకాదు.. ఇంటర్వ్యూ చేసే క్రమంలో షర్మిలను ఆర్కే మూడు.. నాలుగు సార్లు పొగిడేశారు. రాటుదేలుతున్నావ్.. డిప్లమాటిక్ గా ఆన్సర్లు ఇస్తున్నారు.. రాజకీయాలు బాగానే అర్థమవుతున్నాయి.. ఫ్యూచర్ లీడర్ లాంటిమాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. ఇందుకు భిన్నంగా షర్మిల నోటి నుంచి ఆర్కే మీద ఒక్క కాంప్లిమెంట్ కూడా రాకపోవటం గమనార్హం.
ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాల విషయంలో షర్మిల నోటి నుంచి సమాధానాలు రాబట్టటంలో ఆయన ఫెయిల్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఫెయిల్ కంటే కూడా.. తన అతిధిని నొప్పించకూడదన్న ప్రయత్నం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన తన కాలు మీద కాలు వేసుకొని కూర్చునే మార్కు తరచూ చూపిస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటంకనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంటర్వ్యూకు ‘ఓపెన్ హార్ట్’ అన్న పేరుకు తగ్గట్లు.. షర్మిల నుంచి సమాధానాలు రాబట్టలేకపోయారన్న దానికి తగ్గట్లే.. పలు ఉదాహరణలు చూపిస్తున్నారు. జగన్ తో విభేదాల మీద ఫోకస్ పెట్టినప్పటికి.. షర్మిల నోటి నుంచి తాను అనుకున్నట్లుగా సమాధానాలు తెప్పించలేకపోయారు. ఒకవేళ కేసుల్లో జగన్ జైలుకు వెళితే.. సీఎం కుర్చీ ఎవరికి? అన్న ప్రశ్నకు.. షర్మిల ఇచ్చిన సమాధానం ఆమె తెలివికి నిదర్శనంగా కనిపించింది.
ఈ విషయంలోనూ ఆమెను ఫిక్సు చేయటంలో ఆర్కే తేలిపోయారన్న భావన కలిగేలా ఉంది. వైఎస్ ఆత్మగా అభివర్ణించే కేవీపీ రామచంద్రరావును మెంటార్ గా పెట్టుకోవచ్చన్న మాటకు షర్మిల ఆచితూచి సమాధానం ఇవ్వటమే కాదు.. ఆమె సమాధానాన్ని సమర్థించేలా ఆర్కే వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇలా ప్రతి విషయంలోనూ ప్రశ్నలు అడిగే ఆర్కే కంటే కూడా సమాధానాలు చెప్పే షర్మిల పైచేయిని ప్రదర్శించారని చెప్పక తప్పదు.