వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా రోజా పేరే ముందు చెప్పుకోవాలి. ఆమె మాట్లాడితే అందులో బాంబులే పేలుతాయి. ప్రత్యర్ధులు ఆ ధాటికి అసలు తట్టుకోలేరు. ఇక ఆమె పొగిడినా అలాగే ఉంటుంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో రోజా జగన్ని తరచూ పొగుడుతున్నారు అన్న కామెంట్స్ అయితే వస్తున్నాయి. జగన్ గొప్ప పాలకుడు అని ఆమె వీలున్నపుడల్లా మీడియా ముందుకు వచ్చి మరీ గట్టిగా సౌండ్ చేస్తున్నారు.
ఇక భోగీ పండుగ వేళ కూడా రోజా జగన్ గ్రేట్ అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నీ మెరుపులే అని కూడా అంటున్నారు. జగన్ ఏం చేసినా ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేస్తారు తప్ప ఎవరి మీద కక్ష సాదించే అలవాటు ఆయనకు లేనే లేదని ఆమె అన్నారు. జగన్ కేవలం సినిమా టికెట్లను మాత్రమే తగ్గించలేదు, కళాశాలలు, పాఠశాలలలో ఫీజులను కూడా తగ్గించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజులను నియంత్రిస్తూ చర్యలు చేపట్టారు. ఆయనకు పేదల మేలు తప్ప మరో ఆలోచన ఉండదు అని అన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి జగన్ తో భేటీ కావడాన్ని ఆమె శుభ పరిణామమని పేర్కొన్నారు. దీని వల్ల ఇండస్ట్రీ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తెలియచేయడం జరిగిందని అన్నారు. ఎవరైనా జగన్ తో తమ సమస్యలు చర్చించవచ్చునని ఆమె అన్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచమని సినీ వర్గాల నుంచి వస్తున్న వినతుల మీద మాట్లాడుతూ న్యాయం అనిపిస్తే ఏ విషయం అయినా జగన్ కచ్చితంగా చేస్తారు అని ఆమె అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు తప్పకుండా మంచే జరుగుతుందని ఆమె అన్నారు. అయితే వారి సమస్యల విషయంలో ప్రభుత్వం అన్నీ ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది అని ఆమె అనడం విశేషం. ఇక దేశంలోనే బెస్ట్ సీఎం గా జగన్ ఉన్నారని, కరోనా వంటి విపత్తులు వచ్చిన వేళ ఆయన ప్రజల పక్షాన నిలిచి వారికి అండగా ఉంటూ భరోసా ఇచ్చారని ఆమె చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ కి ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తారు అనే ఆమె అంటున్నారు. మరి సినీ వర్గాలకు మంచి కబురు జగన్ చెబుతారా. టికెట్ల రేట్లు పెంచమన్న వారి డిమాండులో న్యాయం ఉందా అన్నదే ఇక్కడ మరో చర్చగా ఉంది.