ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలన ప్రజలను భయకంపితులను చేస్తుంటే...ఆయన తనయుడు నారా లోకేష్ తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు - ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బాబు హామీలకు ఆచరణకు ఎలాంటి పొంతన లేకపోగా...రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొందని తెలిపారు. మరోవైపు లోకేష్ మాత్రం ఊహించని రీతిలో కామెడీలను చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీడియా ముందుకు వస్తే పార్టీ పరువు తీస్తున్నాడని.. మంత్రి లోకేష్ ను ట్వీట్లకు పరిమితం చేశారని, ఆయన పెట్టే ట్వీట్లు చూస్తే నిజంగా ముద్దపప్పు అని అర్థం అవుతుందన్నారు. కెమెరాల ముందు తెలుగుదేశం పార్టీ లొసుగులన్నీ బయటపెడుతున్నాడనే ఉద్దేశంతో లోకేష్ ను ట్విట్టర్ కు పరిమితం చేశారు. అందుకు నలుగురిని అపాయింట్ చేశారో.. లేక ఆయన పెడుతున్నారో తెలియదు కానీ.. తాజాగా అతను పెట్టిన ట్వీట్ తో లోకేష్ అప్పు అని అర్థం అవుతుంది. `ఫ్లెక్స్ అనే కంపెనీని శ్రీసిటీలోని ఎస్ ఈజెడ్ లో పెడుతున్నారు. ఎస్ ఈజెడ్ లో రాయితీలన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధం లేదు. ఇంతపెద్ద కంపెనీని తీసుకొస్తే అన్ని పేపర్లలో పెద్ద పెద్దగా కథనాలు వస్తే సాక్షిలో చిన్నగా రాశారని లోకేష్ ట్వీట్ చేశాడు. ఇతన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఎస్ ఈజెడ్ పెట్టింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. రాష్ట్రానికి సంబంధం లేనప్పుడు రాయడానికి పచ్చమీడియా ముందుంటుంది. సాక్షికి ఏం సంబంధం?ఇన్ని రోజులు లోకేష్ పప్పు అంటే విటమిన్ ఉండేది అనుకున్నారు.. కానీ గన్నేరు పప్పు అని చంద్రబాబుకు అర్థమైంది. ప్రజలకు అర్థమైంది`` అంటూ రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పాలన గురించి ప్రశంసించేందుకు పచ్చ మీడియాల ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని రోజా ఎద్దేవా చేశారు. `ఇదిగో ఒప్పందం అంటే అదిగో పరిశ్రమ అంటూ ఏమీ లేకుండానే పచ్చమీడియా పెద్ద పెద్ద కథనాలు రాస్తుంది. నాలుగు ఏళ్లలో చంద్రబాబు మూడు సార్లు పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లు జరిగితే రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులని చెప్పడం దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడంలా పచ్చమీడియా వైఖరి ఉంటుంది. చంద్రబాబు అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారు. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులని ప్రకటిస్తే కనీసం 20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. రూ. 16,933 కోట్లు మాత్రమే వచ్చాయి.`` అని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ దుర్గమ్మ దేవాలయానికి వస్తే దేవినేని ఉమా ఎందుకు వెళ్లారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. `` ఉమా ప్రోటోకాల్ కోసం వచ్చారా.. లేక కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారా.? తిరుపతికి అమిత్ షా వస్తే రమణదీక్షితులు వెంట నడిచారని అర్చక పదవి నుంచి తీసేశారు. మరి దేవినేని ఎందుకు వెళ్లారు? దేవినేని ఉమ అంటే ఆడా.. మగా అని కేసీఆర్ వ్యాఖ్యానించినప్పటికీ మంత్రి ఎందుకు వెళ్లినట్లు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు పంపించింది నిజం కాదా..?`` అంటూ రోజా ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ తీరు చిత్రంగానే కాకుండా..దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉందని రోజా మండిపడ్డారు. `తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు అంటే ఇంతకు ముందు గౌరవం ఉండేది. ఎందుకంటే కళా వెంకట్రావు ఒక లెటర్ విడుదల చేశారు. దాంట్లో 12 ప్రశ్నలు వేశారు. లేఖలో మొదటి ప్రశ్న వైయస్ జగన్ లక్ష కోట్ల అవినీతి గుర్తించి ప్రస్తావించారు... నాలుగు సంవత్సరాలు బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ లక్ష కోట్ల అవినీతి ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయింది? అసెంబ్లీ సాక్షిగా లక్ష కోట్ల ఆస్తి చూపించి పది శాతం ఇస్తే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడతానని వైఎస్ జగన్ చెప్పారు. నిరూపించే దమ్ములేక తెలుగుదేశం తోకముడిచి పారిపోయింది. అయినా సిగ్గులేకుండా పాతపాటే పాడుతున్నారు` అని వ్యాఖ్యానించారు. టీటీడీని బీజేపీతో కలిసి వైఎస్ ఆర్ సీపీ భ్రష్టుపట్టిస్తుందనటం ఆ పార్టీ దుష్ప్రచారానికి నిదర్శనమన్నారు. ``ఏ రోజు వైఎస్ ఆర్ సీపీ బీజేపీతో కలవలేదు. కలుస్తామని చెప్పలేదు. పెన్ను పేపర్ ఉందని ఇలాంటి పిచ్చిరాతలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతీ లైన్ కు క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం`` అని తెలిపారు. ``తిరుమలను భ్రష్టుపట్టించింది చంద్రబాబు.. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసి ఆ భగవంతుడి కోపానికి గురై బతికిబయటపడింది చంద్రబాబు. సంబంధం లేనివారిని మెంబర్లు చేయడం. పవిత్ర లేని వారిని చైర్మన్లు చేయడం. పోటును తవ్వి అపవిత్రం చేయడం. దొంగతనాలకు లెక్కలు చూపించకుండా తప్పించుకునేందుకు నిందలు ప్రతిపక్షంపై వేస్తున్నారు. బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసింది టీడీపీ. నాలుగేళ్లు అధికారాన్ని రాష్ట్రంలో కేంద్రంలో అనుభవించింది టీడీపీ. పరకాల ప్రభాకర్‌ను సలహాదారుడిగా కొనసాగింది టీడీపీ. బీజేపీ మంత్రి భార్యను దేవస్థానంలో మెంబర్‌గా పెట్టింది టీడీపీ. కుట్రలకు - కుతంత్రాలకు పెటెంట్ రైట్స్ టీడీపీకే ఉన్నాయి. కళా వెంకట్రావు వీటిని నిజం అని నిరూపించాలి. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలి`` అని స్పష్టం చేశారు.
చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతం తేలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారిని తన భర్త జితేంద్ర శారీరంగా హింసిస్తున్నాడని కేసు పెడితే.. జిల్లా మంత్రులు ఆ వెధవకు సపోర్టు చేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ``దేశంలో మహిళలపై జరిగే క్రైం రేటులో 2014–16లో ఆంధ్రరాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదల సర్వేలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంటే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉంది. ఇంకా మహిళలపై జరుగుతున్న అన్ని కేసులు ఫైల్ చేస్తే ఏ స్థానంలో ఉంటుందో ప్రజలే ఆలోచించాలి. కాల్ మనీ సెక్స్ రాకెట్ తో పచ్చకాల నాగులు అమరావతిని ఏ విధంగా భ్రష్టుపట్టించారో.. ఆ మాఫియాను అమరావతి నుంచి చికాగో వరకు తీసుకెళ్లి తెలుగు గౌరవాన్ని గంగలో కలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే ఆయన్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు చికాగోలో మన గౌరవన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా..? శ్రీ గౌతమి హత్య కేసులో తన అక్కను తన కళ్లముందే సజ్జాబుజ్జి అనే వ్యక్తి కారుతో గుద్ది చంపాడని ఒకటిన్నర సంవత్సరం పోరాడి నలుగురికి జైలు శిక్ష పడేలా చేసింది. ప్రతిపక్షంగా వైఎస్ ఆర్ సీపీ - సాక్షి పేపర్ - ప్రజా సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. కనీసం ఆ యువతికి సపోర్టు చేయని పచ్చమీడియా ఇవాళ మావల్లే న్యాయం జరిగింది పెద్ద పెద్ద కథనాలు రాసుకోవడం బాధాకరం. తాజాగా గ్రామసర్పంచి హరిణికుమారి సోషల్ మీడియా సపోర్టు కోరుకుంటూ బాధితురాలు ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి మహిళలంటే చులకన. ఇది ప్రతీసారి నిరూపణ అవుతోంది. రాష్ట్ర వృద్ధి రేటు పెరగదు కానీ మహిళలపై దాడుల్లో రేటింగ్ విపరీతంగా పెరుగుతోంది.`` అంటూ మండిపడ్డారు.