టైటానిక్ ర‌హాస్యాలకు టెలీగ్రాఫ్ కీల‌కం..!

Update: 2020-05-22 00:30 GMT
స‌ముద్రంలో జ‌రిగిన అత్యంత విషాద ఘ‌ట‌న ‌టైటానిక్ నౌక మున‌గ‌డ‌మే. ఆ ప‌డ‌వ మునిగి శ‌త‌బ్దామైనా ఇంకా ఆ నౌక‌పై వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ నౌకకు సంబంధించిన విశేషాలు క‌నుక్కునేందుకు ముంద‌డుగు ప‌డింది. ఇప్ప‌టికే చాలామంది ఆ ప‌డ‌వ‌పై ప‌రిశోధ‌న‌ల‌తో పాటు ఆ నౌక‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆ నౌక‌లో కీల‌కంగా ఉన్న టెలీగ్రాఫ్‌ను వెలికితీసి విశేషాలు తెలుసుకునేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు. 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980 లో ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ పొందింది. రోజురోజుకీ నౌక మరింతగా శిథిలమైపోతున్న నేపథ్యంలో అందులోని మార్కోనీ టెలీగ్రాఫ్ యంత్రాన్ని వెలికితీయాలని ఆర్ఎమ్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే వాటిని ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సహా అనేక సంస్థలు, వ్యక్తులు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

టైటానిక్ అవశేషాలు వీలైనంత వరకు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ నాటి టెలిగ్రాఫ్ వెలికితీయ‌వచ్చంటూ అమెరికా ఫెడరల్ కోర్టు ఆర్ఎంఎస్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ విష‌యాన్ని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. ఈ వేసవిలో నౌక శిథిలాల నుంచి టెలీగ్రాఫ్‌ను వెలికితీసేందుకు అనుమతివ్వాలని ఆర్ఎమ్ఎస్ టైటానిక్ కంపెనీ సోమవారం కోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేసింది. నార్ ఫోల్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి రెబక్కా బీచ్ స్మిత్.. కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు 2000 లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఆ నిబంధనలను సడలించడంతో టైటానిక్ నౌక శిథిలాల్లోని టెలీగ్రాఫ్ యంత్రాన్ని వెలికితీయటానికి అవకాశం ఉంటుంది.

ఆ రేడియో ట్రాన్స్‌మిటర్ ద్వారా నాటి దారుణ ఘటనకు సంబంధించి రహాస్యాలు, అందకుండాపోయిన రేడియో సంభాషణలు బయట పడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ కంపెనీ భావిస్తోంది. నౌక మునిగిపోతున్న సమయంలో నాటి ప్రమాదం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఉపయోగించిన ఆ మార్కోని టెలీగ్రాఫ్‌ చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా ఎంతో విలువైన వస్తువుగా పేర్కొంటున్నారు. నౌకను వీలైనంత వరకు విచ్ఛిన్నం చేయకుండా టెలీగ్రాఫ్ ఉన్న గదికి చేరుకునేందుకు ఆ కంపెనీకి అనుమతి ఇస్తున్నట్లు న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది. దీంతో ఆ నౌక‌లోకి వెళ్లేందుకు ఆ కంపెనీకి అనుమ‌తి ల‌భించింది.

ఆ టెలీగ్రాఫ్ గది నౌక‌లో తెరచే ఉందని సూర్య కాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ లాయర్ డేవిడ్ కాన్‌కెనాన్ తెలిపారు. మార్కోని టెలీగ్రాఫ్‌ ను బయటకు తీసేందుకు పెట్టే ఖర్చుతో పోల్చితే ఆ వస్తువు పెద్ద విలువైనది కాదని, దాని వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా లేదని NOAA ఏప్రిల్‌ లో కోర్టుకు విన్నవించింది. అక్కడ నమ్మశక్యం కాని చరిత్ర నిక్షిప్తమై ఉందని - వందల మంది జలసమాధి అయిపోయార‌ని వారిని గౌరవించడంలో భాగంగా అన్వేష‌ణ వ‌ద్ద‌ని ప‌లువురు కోరుతున్నారు. కోర్టు నిర్ణయాన్ని ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక ఇతర సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. మునిగిన నౌకను అలాగే వదిలేయాని కోరుతున్నాయి.

1912లో టైటానిక్ నౌక అట్లాటింక్ సముద్రంలో మునిగిపోయి సుమారు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది బ‌య‌ట‌ప‌డ్డారు.
Tags:    

Similar News