మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు. ఎదుటోడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. ఎవరో చేసిన తప్పునకు మరెవరో బలి కావాల్సి ఉంటుంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే ఇది నిజమనిపించక మానదు. కొత్త సంవత్సరాన్ని కొంగొత్తగా స్వాగతం పలికి.. ఆ సంతోషంతో ముచ్చట్లు చెప్పుకుంటున్న నలుగురు.. తమ తప్పేమీ లేకున్నా ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఉదంతం కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి కేక్ కట్ చేసిన కడపజిల్లాకు చెందిన కొందరు.. ఆ తర్వాత రోడ్డు పక్కనే చలిమంట వేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇందులో అమిత వేగంతో దూసుకొచ్చిన కారు దెబ్బకు నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. పూటుగా తాగి కారు నడిపిన వ్యక్తి మరణించాడు.
కడప.. పులివెందుల ప్రధాన రహదారిపై ఉన్న పెండ్లిమర్రి మండలం ఇందిరా నగర్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మద్యం సేవించి కారు నడిపటం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో 28 ఏళ్ల భాస్కర్.. 14 ఏళ్ల గిరి.. 12 ఏళ్ల కార్తిక్.. 10 ఏళ్ల లక్ష్మీ నరసింహా ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారును అమిత వేగంతో నడిపిన 24 ఏళ్ల బ్రహ్మానందరెడ్డికి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చేతులారా ప్రాణాలు పోగొట్టుకోవటమే కాదు.. నాలుగు నిండు ప్రాణాలు తీసేశారు. ఈ ఘోర ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.