13 ఏళ్ల నాటి దోపిడీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్‌కు పశ్చిమ బెంగాల్లోని అలీపుర్‌దూర్‌లోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అలీపుర్‌దువార్ జ్యుడీషియల్ మూడవ కోర్టు నిసిత్ ప్రమాణిక్‌పై ఐపీసీ సెక్షన్లు 457 (అక్రమాస్తులు), 383 (దోపిడీ), 411 (నిజాయితీ లేకుండా దొంగిలించబడిన ఆస్తిని స్వీకరించడం) కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కాగా 2009లో అలీపుర్‌దువార్‌లోని రెండు నగల దుకాణాల్లో దోపిడీ జరిగింది. ఈ వ్యవహారంలో భాగంగా కేంద్ర మంత్రికి కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది.
కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నార్త్ 24 పరగణ జిల్లాలోని బరాసత్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుండి అలీపుర్‌దువార్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేశారు.
నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా ఇతర నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అలాగే ఆయన తరఫు న్యాయవాదులెవరూ కోర్టుకు రాలేదు. దీంతో ఆయనకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
కాగా వివాదాల్లో చిక్కుకోవడం నిసిత్ ప్రమాణిక్‌కు ఇది కొత్త కాదు. గతేడాది పౌరసత్వం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ప్రమాణిక్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణిక్ బంగ్లాదేశీయుడని, అతని జాతీయతపై విచారణ జరిపించాలని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రిపున్ బోరా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే బీజేపీ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.
కాగా నిషిత్ ప్రమాణిక్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఉండేవారు. అయితే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన 2019 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కూచ్ బిహార్ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.