సాధారణంగా వీవీఐపీ జోన్ లోకి ఎంటర్ కావటానికి దొంగలు తటపటాయిస్తుంటారు. అందునా.. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో తమ చోరకళను ప్రదర్శించటానికి అస్సలు ఇష్టపడరు సరికదా.. మనకెందుకు తలనొప్పి అన్నట్లుగా ఉంటారు. అలాంటిది.. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కేవలం కిలోమీటర్ దూరంలోని రెయిన్ బో విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ఒకటి దోపిడీకి యత్నించిన వైనం షాకింగ్ గా మారింది.
ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఇంత జరగటం అంటే దేనికి నిదర్శనం? ఇంతటి బరితెగింపు ఎలా వచ్చింది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. చెడ్డీ గ్యాంగ్ చేసిన రచ్చను బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు మూడు రోజుల పాటు విషయాన్ని గోప్యంగా ఉంచటం గమనార్హం.
తాజాగా చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించింది మరెవరి ఇళ్లల్లోనో కాదు.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి క్రిష్ణమోహన్ తో పాటు ఒక వ్యాపారికి చెందిన విల్లాల తలుపులు పగలగొట్టి లోపలకు చొరపడిన వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. భయం బొత్తిగా లేకుండాపోయి.. బరితెగింపు పరాకాష్ఠంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. తాడేపల్లి నవోదయ కాలనీలోని రెయిన్ బో విల్లాల్లోకి ఈ నెల మూడున అర్థరాత్రి దాటిన తర్వాత చెడ్డీ గ్యాంగ్ గా భావిస్తున్న ఐదుగురుసభ్యులు లోపలకు ప్రవేశించారు.
చెడ్డీలు.. తలపాగాలు ధరించిన వీరు తమతో తెచ్చుకున్న గడ్డ పగలుగులతో తలుపులు పగలగొట్టారు. అయితే.. విల్లాల్లో విలువైన వస్తువులు ఏవీ పోలేదని చెబుతున్నారు. ఈ ముఠా ఒకటో తేదీ నుంచి పలు చోట్ల చోరీలకు పాల్పడింది. వాటికి సంబంధించిన సమాచారాన్నిపోలీసులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విల్లాల్లో జరిగిన చోరీ యత్నానికి సంబంధించిన ఫిర్యాదులు ఏవీ తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే లాంటి వారు నివాసం ఉండే హై సెక్యురిటీ జోన్ లో నిఘా.. భద్రతలోని లోపాల్ని తాజా ఉదంతం బయటపెట్టిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇది పోలీసుల వైఫల్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు. నవోదయా కాలనీ పరిసర ప్రాంతాల్లోనే టీటీడీ ఛైర్మన్ తో పాటు పలువురు ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో పాటు పాటు వీవీఐపీలు ఉన్నారని.. వారు ఇక్కడి విల్లాల్ని తమ క్యాంపు కార్యాలయాలుగా.. గెస్టు హౌస్ లుగా ఉపయోగించుకుంటున్నారు.
ఇలాంటి హైసెక్యురిటీ జోన్ లోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వటం కలకలాన్ని రేపుతోంది. అయితే.. ఇక్కడ చోరీకి ప్రయత్నించింది చెడ్డీ గ్యాంగా? ఇంకేదైనా గ్యాంగా? అన్న విషయాన్ని తాము తేలుస్తామని.. దీనికి సంబంధించిన అన్ని వివరాల్ని సేకరిస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏమైనా.. సీఎం నివాసానికి కిలోమీటర్ దూరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటాన్ని పోలీసు శాఖ సీరియస్ గా తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.