మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషాన్ని విక్రయిస్తాం.. తాగి చావండి అంటూ ఎన్నో ఫేస్ బుక్ పేజీల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే నిజంగానే విషమిచ్చి మనల్ని చంపే రకం కాదు వారు.. కేవలం చనిపోవాలనుకునే వారిని మోసం చేసే మోసగాళ్ల పన్నాగం ఇదీ.. తాజా పరిశోధనలో ఈ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఇదంతా బ్రిటన్ దేశంలో జరిగింది.
ప్రాణాలు తీసే విషపు మాత్రలు అమ్ముతామని.. కేవలం 150 పౌండ్లు (రూ.14014) అని ప్యాక్ చేసి పంపిస్తామంటూ సూసైడ్ చేసుకునే వారికి ఆఫర్ ఇస్తున్నారు.
నిజానికి ఆ విషపు మాత్రల్లో వాడే రసాయనం సాధారణ పారిశ్రామిక అవసరాలకు వాడేదే.. బ్రిటన్ లో లైసెన్స్ లేకుండా ఆ రసాయనం కొనడం చట్టవిరుద్ధం. అయితే దాన్ని అమ్ముతానని ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం గమనార్హం.
అయితే చనిపోవాలనుకునే వారు.. లేదా ఎవరినైనా చంపాలనే కుట్రదారులు వారికి డబ్బులు చెల్లించినా ఆ ప్రోడక్ట్ మాత్రం రావడం లేదట.. పైగా క్రిప్టో కరెన్సీలో డబ్బులు పంపమనడంతో ఎవరికి పంపారో కూడా తెలియదు.. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి బలహీనతలను కొందరు ఫేస్ బుక్ లో సోమ్ము చేసుకుంటున్నారని తేలింది.