అత్యుత్తమ పదవుల్లో లేకున్నా వీవీఐపీ సౌకర్యం పొందే వెసులుబాటు గాంధీ ప్యామిలీకి మాత్రమే ఉంటుందేమో. దేశంలో ఎలాంటి రాజకీయ.. రాజ్యాంగపరమైన పదవుల్లో లేనప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీకి ఉన్న వెసులుబాటు అంశం తాజాగా బయటకు వచ్చింది.
విమానాశ్రయాల్లో ఎలాంటి తనిఖీలు చేయకుండా నేరుగా వెళ్లిపోయే అవకాశం దేశంలో 30 మందికి మాత్రమే ఉంది. ఆ 30 మందిలో ప్రియాంక గాంధీ ఒకరన్న విషయాన్ని తాజాగా విమానయాన శాఖాధికారులు వెల్లడించారు.
నిబంధనల ప్రకారం.. ఇలాంటి మినహాయింపు ఉన్న వారితో కలిసి ప్రయాణించే వారికి కూడా ఎలాంటి తనిఖీలు ఉండవు. అంటే.. రాబర్ట్ వాద్రా ఏదైనా ఎయిర్ పోర్ట్ కు ఒక్కడిగా వెళితే ఆయనకు తనిఖీలు తప్పవు. అదే.. తన భార్య ప్రియాంకతో కలిసి వెళితే మాత్రం ఆయనకు ఎలాంటి తనిఖీలు అవసరం లేకుండా అనుమతిస్తారన్న మాట. చాలా తరచూ భర్త హోదాను భార్య ఎంజాయ్ చేయటం కనిపిస్తుంది.
కానీ.. రాబర్ట్ వాద్రా విషయంలో మాత్రం అందుకు భిన్నం. భార్య హోదాను ఎంజాయ్ చేసే అవకాశం రాబర్ట్ కు దక్కుతుంది. అది కూడా ఆమె వెంట ఉన్నప్పుడు మాత్రమే.