మకుటం లేని మహరాణిగా.. రిమోట్ కంట్రోల్ తో ఇంత పెద్ద దేశాన్ని పదేళ్ల పాటు ఏలిన సోనియమ్మ సత్తా ఏమిటో అందరికి తెలిసిందే. ఆమె రేంజ్ గురించి తెలిసిన వారందరికి.. ఆమె అల్లుడి గురించి బాగానే తెలిసి ఉంటుంది. ప్రజాస్వామ్య భారతంలో అత్త కారణంగా అపరిమితమైన రాచ మర్యాదలు పొందిన అల్లుడి హోదాలో అందరికి సుపరిచితుడు రాబర్ట్ వాద్రా. అమ్మగారింట అల్లుడు అయ్యే వరకు అబ్బాయిగారి రేంజ్ ఏమిటి? అత్తమ్మ అధికారంలోకి వచ్చేసిన తర్వాత అయ్యగారు ఎంతలా మారిపోయారన్నది ఢిల్లీ.. ఆ చుట్టుపక్కల వారికి బాగానే తెలుసు.
కేవలం అల్లుడన్న ఒక్క ట్యాగ్ తో వ్యక్తిగత స్థాయి నుంచి.. ఎయిర్ పోర్ట్ వరకూ అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా వీవీఐపీ ట్రీట్ మెంట్ పొందిన ఆయన.. ఏ రోజు కూడా తాను సామాన్యుడిగా ఉండటానికి ఇష్టపడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. తానేమీ బాధ్యతాయుతమైన పదవుల్లో లేనప్పటికీ.. ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించట కానీ.. దయచేసి నన్ను సగటు వ్యక్తిగా ఉంచేయండి? అని కోరుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. అయ్యగారు కానీ.. తనకు కల్పించే భద్రత.. వసతులు వద్దంటూ తిరస్కరిస్తే ఎవరు మాత్రం ఏమనగలరు?
కానీ.. అలాంటి మాటలు మాట వరసకు కూడా చెప్పని వ్యక్తి ఇప్పుడు మాత్రం నీతులు చెప్పటం మొదలు పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జనవరి 1 నుంచి వాహన వినియోగానికి సంబంధించి సరి.. బేసి విధానాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన కొందరు ప్రముఖులు (రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధాని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. కేంద్రమంత్రులు లాంటి కొందరు..).. మహిళలు.. వికలాంగులు లాంటి సాధారణ ప్రజానీకానికి సరి బేసి విధానాన్ని అమలు చేయమని స్పష్టం చేశారు.
ఇలా మినహాయింపులు ఇవ్వటంపై అల్లుడిగారికి మా చెడ్డ చిరాకు వచ్చేసింది. ప్రజాస్వామ్య భారతంలో ఈ మినహాయింపులేంది? చట్టం ముందు అందరూ ఒక్కటేగా? అంటూ కొత్త రాగం తీస్తున్నారు. ప్రజా ప్రయోజనం కోసం ఒక చట్టాన్ని అమలు చేస్తుంటే అందరూ దాన్ని పాటించాలని.. ప్రముఖులుగా ఉండొద్దంటూ సుద్దులు చెబుతున్నారు. మరి.. ఈ బుద్ధి.. అల్లుడిగారి హోదాను అనుభవించిన పదేళ్లలో ఏమైంది? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చూస్తుంటే.. అయ్యగారి పేరు అత్యంత ప్రముఖుల జాబితాలో లేకపోతే.. ఇక అందరూ అలానే ఉండాలని అనుకుంటున్నారా? ఏంటి..?