దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు కోట్లాది మంది రోడ్ల మీదకు వస్తే.. లక్షలాది మంది త్యాగాలు చేశారు.. వేలాదిమంది తమ ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం ఆర్పించారు. వీరే కాదు.. జాతిపిత గాంధీ.. సర్దార్ పటేల్.. బోస్.. ఇలా చెప్పుకుంటే చాలామంది దేశం కోసం పడిన పాట్లు అన్నిఇన్ని కావు. కానీ.. వారికి.. వారి కుటుంబాలకు దక్కంది నెహ్రూ కుటుంబానికి మాత్రమే దక్కింది. గాంధీ పేరును అరువుగా తెచ్చుకొని తమ పేర్ల చివర్లో పెట్టుకొని రాజ్యమేలటం అలవాటైన ఇందిర ఫ్యామిలీకి.. నాటి నుంచి నేటి వరకూ దేశానికి వారు మాత్రమే దిక్కు అన్న చందంగా మారింది.
ఒకరి తర్వాత ఒకరుగా వంశపార్యం పరంగా దేశానికి తాము మాత్రమే దిక్సూచి అన్నట్లుగా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానిదే హవా. ఎంతోమంది నేతలున్నా వారెవరికీ దక్కంది గాంధీ కుటుంబానికి మాత్రమే దక్కిందని చెప్పాలి. ఆ పరంపర రాహుల్ గాంధీ వరకూ వచ్చింది. ఇది చాలదన్నట్లుగా రేపోమాపో రాహుల్ సోదరి ప్రియాంక పేరును తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో బయటకు వచ్చి నాలుగు ప్రసంగాలు చేసి వెళ్లిపోయే ప్రియాంక భర్త.. సోనియమ్మ అల్లుడైన రాబర్ట్ వాద్రా గురించి ఇక్కడ కాస్త చెప్పుకోవాలి.
తానొక వ్యాపారిగా చెప్పుకుంటూనే.. రాజకీయాల్లో రాణించాలని అతగాడి ఆత్రం అంతాఇంతా కాదు. అత్తమ్మ దేశాన్ని తన రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తున్నప్పుడు అల్లుడిగారి హవా ఏ స్థాయిలో నడిచిందో అందరికి తెలిసిందే. అలాంటి అల్లుడిగారిని కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఫోకస్ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని తెలిసిన సోనియా.. అతగాడ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినట్లుగా వ్యవహరించేవారు.
నలుగురి కంట్లో పడకుండా తన ‘పవర్’ను ప్రదర్శించేలా అల్లుడిగారికి సోనియమ్మ బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్లుగా పలువురు చెబుతుంటారు. మరింత కాలం తన మానాన తాను అన్నట్లుగా జనం కంటికి కనపడకుండా ఉన్న రాబర్ట్ వాద్రా ఈ రోజు పబ్లిక్ లోకి వచ్చేశారని చెప్పాలి. అదెలానంటే.. సేవ్ డెమోక్రసీ పేరిట తన అత్తమ్మ సోనియా.. బావమరిది రాహుల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లతో సహా కాంగ్రెస్ పరివారం రోడ్ల మీదకు వచ్చి నిరసన నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరివారం ప్రదర్శించిన పోస్టర్లలో వాద్రా ఫోటోలు తొలిసారి దర్శనమివ్వటం గమనార్హం. తన తల్లి.. సోదరుడు తరఫున ప్రియాంక ప్రచారం నిర్వహించిన సందర్భంలోనూ వాద్రా ఫోటోలు కనిపించని దానికి భిన్నంగా తొలిసారి కాంగ్రెస్ ప్రచారంలో అల్లుడుగారి ఫోటో కనిపించటం చూస్తే.. గాంధీ వారసులే కాదు.. వారి అల్లుళ్లు కూడా జనాల్ని ఉద్దరించేందుకు కంకంణం కట్టుకున్నారా? అనిపించక మానదు.