కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు ఇప్పట్నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ రథసారథి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. అయితే, మరో రూపంలో కూడా ఆ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. అదే దైవభక్తితో. ఔను ఇటీవలి కాలంలో గుళ్లూ - గోపురాల్లో తిరుగుతూ రాహుల్ గాంధీ హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే...తాజాగా అదే రీతిలో ఆయన ప్రధానమంత్రి అయ్యేందుకు బావ రంగంలోకి దిగారు. ప్రముఖ పారిశ్రామికవేత్త - ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు వాద్రా తెలిపారు
శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆయన తిరుమల శ్రీవారిని రాబర్ట్ వాద్రా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మార్పు కోసం బావ రాహుల్ గాంధీ చాలా కష్టపడుతున్నారని, వారికి మా కుటుంబం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు వాద్రా తెలిపారు. దీంతో పాటుగా తమ అత్తగారైన సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. తన సతీమణి అయిన ప్రియాంక గాంధీ మద్దతు రాహుల్‌కు ఎల్లప్పుడూ ఉంటుందని వాద్రా తెలిపారు.