మనుషుల స్థానంలోకి మరమనుషులు వచ్చేస్తున్నారు. మనిషి మాదిరే కనిపించటమే కాదు.. వారి మాదిరి పనుల్ని.. వారి కంటే వేగంగా చేసే కొత్త తరం రోబోలు వస్తున్న సంగతి తెలిసిందే. మనుషులకు ఎలా అయితే గుర్తింపు ఇస్తారో.. అదే మాదిరి.. రోబోలకు పౌరసత్వం ఇచ్చే కొత్త విధానం కొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే మొదలైంది.
ప్రపంచంలో తొలి రోబోఎ సిటిజెన్ గా పేరొందిన సోఫియా.. తొలిసారి భారత్ లో సందడి చేసింది. శనివారం ఐఐటీ బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్ 2017కు హాజరైంది. ఈ సందర్భంగా భారత చీరకట్టులో కనిపించిన రోభామ సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుపు చీర.. కాషాయరంగు జాకెట్టు ధరించి.. అచ్చం భారతీయ వనితలా తయారైంది. ఈ కార్యక్రమంలో తన కృత్రిమ మేధను ప్రదర్శించింది. అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. రోభామ సోఫియాకు సౌదీ ప్రభుత్వం పౌరసత్వం కల్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించటం తెలిసిందే.